PPM: ఆశ్రమ పాఠశాలలో ఏఎన్ఎంల నియామకం చేపట్టాలని సీపీఐ నాయకుడు తోట జీవన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పార్వతీపురంలోని కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నిరసన తెలియజేశారు. ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు రక్షణ కరువైందని మండిపడ్డారు. ఆశ్రమ పాఠశాలల్లో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.