AP: ఓ ప్రముఖ మీడియాకు రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు పంపించింది. కల్తీ మద్యం మరణాలపై అసత్య ప్రచారం చేస్తుందంటూ నోటీసుల్లో పేర్కొంది. ఆధారాలు చూపాలంటూ సెక్షన్ 179(1) కింద ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. సాక్షి యాజమాన్యంతోపాటు పత్రిక చీఫ్ ఎడిటర్ ధనుంజయ రెడ్డి, సాక్షి నెల్లూరు జిల్లా బ్యూరో చీఫ్ మస్తాన్ రెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి.