కృష్ణా: ఉయ్యూరు ఎక్సైజ్ కార్యాలయం వద్ద వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని సోమవారం చేపట్టారు. కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం తయారీకీ ఏకంగా ఒక పరిశ్రమ తరహాలో ఫ్యాక్టరీలు నెలకొల్పి, బ్రాంచ్లు ఏర్పాటు చేసి, సప్లై చేసిన విధానం బట్టబయలైందని పెనమలూరు వైసీపీ ఇంఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం ప్రజలకు క్షమాపణలు చెప్పాలని తెలిపారు.