AP: నకిలీ మద్యంపై వైసీపీ పోరుబాటలో భాగంగా చిలకలూరిపేట ఎక్సైజ్ ఆఫీసు దగ్గర మాజీ మంత్రి విడదల రజినీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఆ తర్వాత ఎక్సైజ్ సీఐకి వినతిపత్రం ఇచ్చారు. నకిలీ మద్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. నకిలీ మద్యం మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.