ADB: భీంపూర్ మండలంలోని పిప్పల్ కోటి భవిత కేంద్రంలో వాలంటీర్ (ఆయా) పోస్టుకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి రాధాకృష్ణారెడ్డి సోమవారం ప్రకటనలో తెలియజేశారు. సర్వ శిక్ష అభియాన్ పరిధిలోగల ఉద్యోగానికి రూ.3250 గౌరవ వేతనం ఉంటుందన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణత ఉన్న స్థానిక మహిళా అభ్యర్థులు ఈనెల 15 తేదీ సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.