ATP: అనంతపురం పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సోమవారం 20 మంది లబ్ధిదారులకు మొత్తం 22 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతపురం సర్వజన ఆసుపత్రిని 560 పడకల నుంచి 1200 పడకల ఆసుపత్రిగా విస్తరించేందుకు ఇప్పటికే డీపీఆర్ పంపించామన్నారు. రాష్ట్రంలో వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు.