SRD: మిషన్ భగీరథ నీళ్లు పూర్తి స్థాయిలో రావడంలేదని ఆరోపిస్తూ ఆదిత్య నగర్ కాలనీ బస్సులు కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు సాయిలు మాట్లాడుతూ.. మంచినీళ్లు పూర్తి స్థాయిలో రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. మున్సిపల్ అధికారులకు విన్నవించిన పట్టించుకోవడంలేదని ఆరోపించారు.