WGL: జిల్లా మండిబజారులోని కుర్షీద్ హోటల్ యజమానిపై మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. CI కరుణాకర్ వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం రణవీర్, అతని సోదరుడు సూర్య హోటల్‌కు వెళ్లారు. అక్కడ గొడవ జరగగా, HNKకు చెందిన నితీశ్, తరుణ్, చందులు వారిపై దాడి చేశారు. WGL సిటీ యాక్ట్ ఉల్లంఘన నేపథ్యంలో హోటల్ యజమానితోపాటు దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు CI తెలిపారు.