ADB: తాంసి మండలంలోని కప్పర్ల గ్రామస్తులు బుధవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 4న శనివారం సాయంత్రం నిర్వహించే బతుకమ్మ నిమజ్జన వేడుకలకు రావాలని కోరుతూ ఆహ్వానించారు. గ్రామస్థుల ఆహ్వానం మేరకు కలెక్టర్, ఎస్పీ నిమజ్జన కార్యక్రమానికి రావడానికి సానుకూలంగా స్పందించారని తెలిపారు.
ADB: బుధవారం గుడిహత్నూర్ మండలంలోని శర్మ దాబా సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. గుడిహత్నూర్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న ఆటోను మహారాష్ట్రకు చెందిన బస్సు ఢీకొట్టింది. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన డ్రైవర్‌ను 108 అంబులెన్స్‌లో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
మేడ్చల్: జీడిమెట్ల డివిజన్ ప్రసూననగర్‌లోని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా MLA కేపీ వివేకానంద్ హాజరై మాట్లాడుతూ.. అనుభవం అనేది పుస్తకాలలో దొరకదు, వృద్ధుల సాన్నిధ్యంలోనే లభిస్తుందని అన్నారు. సీనియర్ సిటిజన్స్ అన్ని రంగాలలో తమ అనుభవాలను యువతతో పంచుకోవాలని అన్నారు.
NLG: చిట్యాల పట్టణం, శివనేనిగూడెం వెళ్లే దారిలో రోడ్డు గుంతలు పడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పడిన గుంతలు ప్రమాదకరంగా మారాయి. ప్రభుత్వ ఆసుపత్రికి, శివనేనిగూడెం వెళ్లేవారు స్థానికులు కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నారు. మాజీ కౌన్సిలర్ బెల్లి సత్తయ్య సొంత ఖర్చులతో బుధవారం ట్రాక్టర్ల ద్వారా డస్ట్‌ని తెప్పించి బుధవారం గుంతలను పూడిపించారు.
HYD: దేవీ నవరాత్రుల సందర్భంగా సైదాబాద్ SBH కాలనీలోని శ్రీ విద్యానంద ధర్మ సమస్త శ్రీ విద్యాపీఠంలో లలితా అమ్మవారిని బీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు దర్శించుకున్నారు. భాస్కర రాయల పరంపరలో స్థాపిత ఈ శక్తిపీఠానికి దాదాపు 400 ఏళ్ల చరిత్ర ఉంది. భక్తులు ఇక్కడ ఆధ్యాత్మిక విశ్వాసంతో వచ్చి పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు.
GDWL: జిల్లా కేంద్రంలోని డీకే బంగ్లాలో బుధవారం ‘సేవా పక్షం’లో భాగంగా మేధావుల సదస్సు గద్వాల్ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు నిర్వహించారు. రామాంజనేయులు మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు చురుగ్గా పాల్గొని, గెలిచి అంకితభావంతో ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు. మోది లక్ష్యాన్ని నెరవేర్చాలని కొనియాడారు.
KNR: ప్రసిద్ధి చెందిన కరీంనగర్ చైతన్యపురి కాలనీలోని శ్రీ మహాశక్తి దేవాలయాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కరీంనగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఉన్నారు.
NZB: గ్రామపంచాయితీల వారీగా ప్రభుత్వం చేసిన కులగణనను బయటపెట్టాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కులగణనతో ఈ రిజర్వేషన్లను పోల్చితే ఎంత పారదర్శకత ఉందో తేలిపోతుందని అన్నారు. గ్రామ పంచాయితీల వారీగా వివరాలు బయటపెట్టి అక్కడ ఎవరి జనాభా ఎక్కువ ఉంటే వారికి ఆ స్థానం కేటాయించాలని కోరారు.
BHNG: భువనగిరి మండలం రాయగిరి గౌడ సంఘం అధ్యక్షుడుగా గడ్డమీది చంద్రయ్య గౌడ్ నాల్గోసారి ఏకగ్రీవంగా బుధవారం ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన ఎన్నికలకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. గౌడ సంఘం సమస్యలపై తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద గౌడ్ పెద్దగాని పోశెట్టి గౌడ్, శ్రీరాములు, వెంకటేష్, అనిల్, పాండు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.
MBNR: బాలనగర్ మండలంలోని చింతకుంట తండాలో బుధవారం ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా తండాలోని పలువురు వృద్ధులను సన్మానించి పండ్లను అందజేశారు. ఈ సందర్భంగా మేరా యువభారత్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ రాజేష్ మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో వృద్ధులను గౌరవప్రదంగా చూసుకుంటూ.. వాళ్లకు కావాల్సిన సౌకర్యాలను కల్పించాలన్నారు. వృద్ధులకు సేవ చేసి రుణం తీర్చుకోవాలన్నారు.
SDPT: హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆర్టీసీ నూతన ఎండీ నాగిరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. నూతనంగా ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన నాగిరెడ్డికి మంంత్రి శుభాకాంక్షలు తెలిపారు. టీజీ ఆర్టీసీ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ఆయనకు సూచించారు. పలు అంశాలపై వారు చర్చించారు.
MDK: నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్యకు తపస్ కార్యవర్గం జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేష్, రాష్ట్ర కార్యదర్శి గడప నవీన్, రాష్ట్ర బాధ్యులు ఆర్వి రామారావు, తపస్ మెదక్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మణ్‌లు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
NGKL: రెడీక్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ రక్తదాన దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథి డీఎంహెచ్‌వో డా. రవి కుమార్ నాయక్ రక్తదాతలను సన్మానించారు. రక్తదానం మహత్తరమైన మానవతాసేవ అని, మరొకరి ప్రాణాన్ని కాపాడటం కంటే గొప్పసేవ లేదన్నారు. రక్తాన్ని తయారు చేయలేమని, రక్తదాతలే నిజమైన దేవుళ్లని పేర్కొన్నారు.
NRPT: మక్తల్ పట్టణంలోని రాయచూరు రోడ్డులో బుధవారం రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొనడంతో మాగనూరు మండలం వడ్వాట్‌కు చెందిన కిష్టప్పకు తీవ్ర గాయాలయ్యాయి. రాయచూరు రోడ్డులో మలుపు వద్ద ప్రమాదం జరగడంతో, కిష్టప్పకు అంతర్గత రక్తస్రావం కావడంతో వెంటనే మక్తల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యులు జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు.
KMM: దేవీశరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సీఐ సాగర్ అన్నారు. బుధవారం పోలీస్ స్టేషన్‌లో ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. DJలకు అనుమతి లేదని, స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నిభందనలు ఉల్లంఘించరాదాని సీఐ చెప్పారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చట్టరీత్యా కఠినచర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.