WNP: కొత్తకోట మండలం కానాయిపల్లిలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ కోటి లింగేశ్వర దత్త ఆలయంలో 10వరోజు గురువారం జ్ఞానాంబికాదేవి మహిషాసురమర్దిని అవతారంలో దర్శనమిచ్చారు. మహిళ భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి సహస్రనామ స్తోత్ర పారాయణంతో కుంకుమార్చనలు చేశారు. అనంతరం ధూప దీప నైవేద్యాలతో మహా మంగళహారతి సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.