Margadarsi చిట్ ఫండ్ కేసులో శైలజకు AP CID నోటీసులు
Margadarsi:మార్గదర్శి (Margadarsi) చిట్ ఫండ్ అక్రమాలు, నిధుల మళ్లింపు కేసులో ఎండీ శైలజా (sailaja) కిరణ్‌కు ఏపీ సీఐడీ (ap cid) నోటీసులు జారీచేసింది. ఈ కేసులో ఏ2గా శైలజ ఉండగా.. ఏ1గా రామోజీరావు (Ramoji rao) ఉన్నారు. విచారణకు అందుబాటులో ఉండాలని సీఐడీ (cid) డీఎస్పీ రవి కుమార్ (dsp ravi kumar) శైలజకు నోటీసులు ఇచ్చారు.

మార్గదర్శి చిట్ ఫండ్స్‌లో (Margadarsi) అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై విచారిస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నెల 29వ తేదీ లేదంటే 31వ తేదీ లేదంటే ఏప్రిల్, 3 లేదా 6వ తేదీల్లో అందుబాటులో ఉండాలని కోరింది. ఇళ్లు లేదా ఆఫీసులో విచారణకు ఉండాలని స్పష్టంచేసింది.
మార్గదర్శి (margadarsi) చిట్ ఫండ్స్ నిధుల బదిలీ విషయంలో ఆ సంస్థకు ఈ నెల 21వ తేదీన తెలంగాణహైకోర్టులో (Telangana high court) ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఇంతలో సీఐడీ నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. తమ సంస్థలో సోదాల గురించి తెలంగాణ హైకోర్టు రామోజీరావు వివరించారు. ఆయన (ramoji rao) తరఫున సుప్రీంకోర్టు (supreme court) సీనియర్ లాయర్ సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. తమ క్లైంట్‌ను వేధింపులకు పాల్పడుతున్నారని.. కావాలనే సోదాలు జరిగాయని సిద్దార్థ్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. చిట్ ఫండ్ (chit fund) నిధులను బ్యాంకులో (bank) జమ చేయాలి కానీ.. మ్యుచువల్ ఫండ్స్‌కు మళ్లించడంపై ఏపీ సీఐడీ (ap cid) అధికారులు ప్రశ్నించారట. నిధులు బదిలీ చేస్తే.. దుర్వినియోగం అనలేమని ధర్మాసనం స్పష్టంచేసింది. ఖాతాదారులను మోసం చేశారని అనలేదని పేర్కొంది.
మార్గదర్శికి (margadarsi) సంబంధించి ఖాతాదారులు ఫిర్యాదు చేయలేదని పేర్కొంది. అలాంటి సమయంలో ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగడంపై హైకోర్టు (high court) ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రామోజీరావు, శైలాజా కిరణ్‌పై బలవంతపు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు (high court) స్పష్టం చేసింది. ఇంతలోనే ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది.