తెలంగాణ (Telangana) రాజధాని హైదరాబాద్‌లో(Hyderabad) అప్పడే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. నిన్న మెున్నటి వరకు వర్షాలతో వాతావరణ చల్లగా ఉంది. అయితే, రాబోయే రోజుల్లో ఎండలు త్రీవంగా ఉంటాయని వాతావరణ శాఖ (Department of Meteorology) హెచ్చరించింది. ఈ వారం నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగే అవకాశం ఉన్నందున భారత వాతావరణ విభాగం (ఐఎండి) హైదరాబాద్ ఎల్లో అలర్ట్ (Yellow Alert) జారీ చేసే అవకాశం ఉంది.
తెలంగాణ (Telangana) రాజధాని హైదరాబాద్‌లో(Hyderabad) అప్పడే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. నిన్న మెున్నటి వరకు వర్షాలతో వాతావరణ చల్లగా ఉంది. అయితే, రాబోయే రోజుల్లో ఎండలు త్రీవంగా ఉంటాయని వాతావరణ శాఖ (Department of Meteorology) హెచ్చరించింది. ఈ వారం నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగే అవకాశం ఉన్నందున భారత వాతావరణ విభాగం (ఐఎండి) హైదరాబాద్ ఎల్లో అలర్ట్ (Yellow Alert) జారీ చేసే అవకాశం ఉంది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉంది. ఆదిలాబాద్(Adilabad), జగిత్యాల, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఎండలు మండిపోనున్నాయి.
ఇటీవల, హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో వేసవి వేడి నుంచి నగర వాసులకు ఉపశమనం కలిగించింది. ఇప్పుడు హైదరాబాద్‌లో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉన్నందున మార్చి 31 వరకు IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) కూడా రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 36 నుండి 40 డిగ్రీల సెల్సియస్‌లో నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల సెల్సియస్ నుంచి 37 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ నుండి 24 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండే అవకాశం ఉంది. IMD, TSDPS రెండూ చేసిన సూచనల దృష్ట్యా, నగర వాసులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
రంజాన్ పండుగ (Ramadan festival) సందర్భంగా వేసవి తాపం పెరుగుతున్నందున, సెహ్రీ సమయంలో తగినంత నీరు త్రాగటం చాలా అవసరం. దాదాపు 2 లీటర్ల నీరు ఒక వ్యక్తి ఉపవాస సమయంలో ఒక రోజంతా హైడ్రేట్‌గా (Hydrate) ఉండటానికి సహాయపడుతుంది. సెహ్రీ భోజనం చివరిలో పెరుగు తినడం శాస్త్రీయంగా సరైనది. ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది కడుపుని శాంతపరచడానికి ఆమ్లతను నిరోధించడానికి సహాయపడుతుంది. చివరికి డీహైడ్రేషన్ (Dehydration) రాకుండా చేస్తుంది. హైడ్రేటెడ్ గా ఉండటానికి, భోజనంలో మసాలా, ఉప్పు , చక్కెరను తక్కువగా ఉంచండి. దోసకాయ, టొమాటో సలాడ్ వంటి నీరు అధికంగా ఉండే ఆహారాలు, పుచ్చకాయ, నారింజ, కివీ వంటి జ్యుసి పండ్లను సెహ్రీ మీల్లో(Sehri meal) తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.