MLA Mekapati Chandhra Shekhar : మాజీ మంత్రి అనిల్ కుమార్ కి.. మేకపాటి కౌంటర్..!
MLA Mekapati : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ కి ఓటు వేశారని, నలుగురు ఎమ్మెల్యేల ఫై జగన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సస్పెండ్ కు గురైన నలుగురు ఎమ్మెల్యే లపై వైస్సార్సీపీ నేతలు పలు విమర్శలు చేస్తూ వస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ కి ఓటు వేశారని, నలుగురు ఎమ్మెల్యేల ఫై జగన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సస్పెండ్ కు గురైన నలుగురు ఎమ్మెల్యే లపై వైస్సార్సీపీ నేతలు పలు విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా విమర్శలు చేశారు. కాగా… తమపై విమర్శలు చేసిన అనిల్ కుమార్ కి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ చెప్పడం చాలా బాధాకరమని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. అనిల్ నువ్వు ఓడిపోతున్నావు ..ముందు అది చూసుకో.అంటూ వార్నింగ్ ఇచ్చారు. తాము నలుగురం నూటికి నూరుపాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలుస్తామని సవాలు విసిరారు. రాబోయే ఎన్నికల్లో మీరే చూస్తారు కదా..పార్టీ భ్రమలో మీరు మాట్లాడుతున్నారన్నారు. కచ్చితంగా ప్రభుత్వం మారుతుందని సవాలు చేశారు. గత ఎన్నికల్లో సింగిల్ డిజిట్ తో అనిల్ గెలిచాడని ఆ విషయం మర్చిపోయి మాట్లాడుతున్నాడంటూ గుర్తు చేశారు. నీకు కూడా పార్టీ టికెట్ ఇవ్వదనే ప్రచారం జరుగుతోంది.. ముందు అని చూసుకో అంటూ కౌంటర్ ఇచ్చారు.