మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav)పై టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి తీవ్రస్ధాయిలో ఫైర్ అయ్యారు. ఆనం ఫ్యామిలీని అంతం చేసే మగాడు ఇంకా పుట్టలేదురా బచ్చా అనిల్ అంటు ఘటుగా మండిపడ్డారు. నారా లోకేశ్ (Nara Lokesh) యువగళం పాదయాత్ర క్యాంప్ సైట్ వద్ద మీడియాతో ఆనం మాట్లాడారు. ‘‘నువ్వు ఒరేయ్ తురేయ్ అంటే మేం దానికి మించి మాట్లాడతాం.. ‘ఒరేయ్ జగన్’ ‘ఒరేయ్ అనిల్, తురేయ్ అనిల్’ అంటే నువ్వు, నీ నాయకుడు తల ఎక్కడ పెట్టుకుంటారు?” అని ప్రశ్నించారు. ‘‘మా యువ నాయకుడు లోకేశ్ అమెరికా(America)లో చదివాడని గర్వంగా చెప్పుకుంటాం.. మీ నాయకుడు ఏం చదివాడో, ఎక్కడ చదివాడో చెప్పగలవా అనిల్? స్టాన్ ఫోర్డ్(Stan Ford)లో చదివిన లోకేశ్ పప్పా?.. పదోతరగతి తప్పిన సీఎం జగన్ (CM JAGAN) నిప్పా?”అని నిలదీశారు. మీ నాయకుడు గంటపాటు తడబడకుండా మీడియాతో మాట్లాడగలడా? కాగితాలు చూడకుండా సమాధానం చెప్పగలడా? మీ నాయకుడి చదువు ఇదని ఫలానా చోట చదివాడని చెప్పగలవా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
సొంత బాబాయ్ సహా, నెల్లూరు జిల్లా (Nellore District) వైసీపీ నేతలతో, ఆఖరికి మంత్రులతో కూడా నీకు ఎందుకు పడటంలేదు అనిల్? అని అడిగారు. జగన్ టిక్కెట్లు ఇచ్చిన వారిని ఓడించిన అనిల్, ముఖ్యమంత్రికి వీరాభిమానా? అని ప్రశ్నించారు. వైసీపీ (YCP) నేతకు ఇంటర్నేషనల్ నోటీసు వచ్చిందని మాజీమంత్రి బహిరంగంగా అంటే ముఖ్యమంత్రి స్పందించడా? అని నిలదీశారు. ఆనం కుటుంబాన్ని అంతంచేసే మగాడు ఇంకా పుట్టలేదురా బచ్చా అనిల్.. మీలో మీకు బెట్టింగ్(Betting) ,మాదకద్రవ్యాల సొమ్ములో పంపకాల్లో తేడాలొచ్చి, ఆ నిరాశా నిస్పృహల్ని మా నాయకుడిపై చూపిస్తే ఊరుకుంటామా?.. వైసీపీ (YCP )నేతకు ఇంటర్నేషనల్ నోటీసు వచ్చిందని మాజీమంత్రి బహిరంగంగా అంటే ముఖ్యమంత్రి స్పందించడా?.. అనిల్ కుమార్ వ్యాఖ్యల్ని సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేయాల్సిన బాధ్యత డీజీపీ (DGP)కి లేదా?’’ అంటూ ఆనం వెంకటరమణా రెడ్డి ప్రశ్నించారు.