»Nellore Mla Anil Kumar Yadav Response About Deputy Mayor Roop Kumar Yadav Comments
Nellore ఆ పాపం ఎవరిది.. నిందలు నేను మోయల్న? బాబాయ్ పై అనిల్ గరంగరం
నా కష్టం నాది. అందరూ సహకరిస్తే నేను ఎమ్మెల్యేగా గెలిచా. ఎవరో ఒకరు చేస్తే నేను ఈ స్థాయికి రాలేదు. ఏ రోజు లోపాయికారి ఒప్పందం చేసుకోలేదు. బెట్టింగ్ బంగార్రాజు అంటూ కామెంట్లు వస్తున్నాయి. ఆ పాపం ఎవరిది? ఆ నిందలు ఎవరు మోస్తున్నారు.
ఏపీలోని నెల్లూరు జిల్లాలో (Nellore District) రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార పార్టీ వైఎస్సార్ సీపీలోనే వర్గ రాజకీయాలు తీవ్ర రూపం దాల్చాయి. నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ (Poluboina Roop Kumar Yadav), స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మధ్య వర్గ పోరు తీవ్రమైంది. పార్టీ కార్యకర్తపై దాడి సంఘటన వారిద్దరి ఉన్న గొడవకు (Clashes) మరింత ఆజ్యం పోసింది. దీంతో బాబాయ్, అబ్బాయ్ పరస్పరం దూషించుకున్నారు. నువ్వెంత అంటే.. నువ్వెంత అనేంత స్థాయికి పరిస్థితి ముదిరింది. తన బాబాయ్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే అనిల్ తీవ్రంగా స్పందించారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న హాజీపై (Haji) శుక్రవారం దాడి జరిగింది. కొందరు దుండగులు కత్తులతో హాజీపై విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన హాజీని ఆస్పత్రికి తరలించారు. శనివారం హాజీని ఉప మేయర్ (Deputy Mayor) రూప్ కుమార్ పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ కుమార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర పదజాలంతో తనను దూషించడంపై ఎమ్మెల్యే అనిల్ బదులిచ్చాడు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ యాదవ్ (Anil Kumar Yadav) మాట్లాడుతూ.. ‘హాజీపై జరిగిన దాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నెల్లూరులో ఏం జరిగినా దానికి కాకారణం అనిల్ అంటూ బురద జల్లుతున్నారు. నా కష్టం నాది. అందరూ సహకరిస్తే నేను ఎమ్మెల్యేగా గెలిచా. ఎవరో ఒకరు చేస్తే నేను ఈ స్థాయికి రాలేదు. ఏ రోజు లోపాయికారి ఒప్పందం చేసుకోలేదు. బెట్టింగ్ బంగార్రాజు అంటూ కామెంట్లు (Comments) వస్తున్నాయి. ఆ పాపం ఎవరిది? ఆ నిందలు (Allegations) ఎవరు మోస్తున్నారు. భరించా.. నేను నిజంగా దిగజారితే ఇంటర్నేషనల్ నోటీసులు వచ్చాయి. ఐదు నిమిషాలు చాలదా లీక్ ఇవ్వడానికి?’ అని ప్రశ్నించారు.
‘ఏది జరిగినా నా మీద రుద్దాలని చూస్తే ఎలా? ఇది మంచి పద్ధతి కాదు. అవును నాకు విరుద్ధంగా ఉన్నవారికి దూరంగా ఉంటున్నా. నిశ్శబ్ధంగా ఉంటున్నా. అన్నిటికి సిద్ధపడి ఉన్నా. మాట్లాడేటప్పుడు నా పేరు (Name) చెప్పించడం సరికాదు. నాపై బురద జల్లడం మంచిది కాదు’ అని అనిల్ తెలిపాడు.