»Narayanas Interesting Comments On Polls In The Upcoming Elections
CPI : వచ్చే ఎన్నికల్లో పోత్తులపై నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు
సీపీఐ జాతీయ కార్యదర్మి నారాయణ (Narayana) ఏపీ రాజకీయాలకు సంబంధించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో సీపీఐ (CPI) బరిలో దిగుతుందని ఆయన తెలిపారు. టీడీపీ, (TDP) జనసేన, సీపీఐ కలిసి పోటీ చేస్తాయని తెలిపారు. పొత్తు కుదిరితే ఓట్లు ఇవ్వడమే కాదు, సీట్లు కూడా ఇవ్వాలని అన్నారు.పొత్తు కుదిరితే ఓట్లు ఇవ్వడమే కాదు, సీట్లు ఇవ్వాలని ఆయన తెలిపారు.
సీపీఐ జాతీయ కార్యదర్మి నారాయణ (Narayana) ఏపీ రాజకీయాలకు సంబంధించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో సీపీఐ (CPI) బరిలో దిగుతుందని ఆయన తెలిపారు. టీడీపీ, (TDP) జనసేన, సీపీఐ కలిసి పోటీ చేస్తాయని తెలిపారు. పొత్తు కుదిరితే ఓట్లు ఇవ్వడమే కాదు, సీట్లు కూడా ఇవ్వాలని అన్నారు.పొత్తు కుదిరితే ఓట్లు ఇవ్వడమే కాదు, సీట్లు ఇవ్వాలని ఆయన తెలిపారు. రాష్ట్రం మేలు కోరి ఏవైనా సలహాలు సూచనలు ఇస్తే, తీసుకునే తత్వం ,సీఎం జగన్ (CM JAGAN) కు లేదని ఆయన అన్నారు. పోలవరం(Polavaram)పై పోరాడడానికి రాష్ట్ర ప్రభుత్వానికి భయంగా ఉంటే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని సూచించారు.
విభజన హామీలు తాము సాధించుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు. జగన్ శూరుడు, వీరుడు అనుకుంటే, కేంద్రం వద్ద మోకరిల్లుతున్నాడని నారాయణ (Narayana) విమర్శించారు. పోలవరంపై దివగంత రాజశేఖర్ రెడ్డిలో(Rajasekhar Reddy) ఉన్న పోరాటతత్వం జగన్ లో కనిపించడంలేదని తెలిపారు. చూస్తుంటే తండ్రి సిద్ధాంతాలకు కూడా జగన్ పంగనామాలు పెట్టేట్టు ఉన్నాడని నారాయణ విమర్మించారు.