»Sri Kodandarams Chakra Bath As A Celebration In Brahmotsavam
Kodanda ramaswamy: వేడుకగా కోదండరాముడి చక్రస్నానం
తిరుపతి శ్రీకోదండరామస్వామి(tirupati kodanda ramaswamy) వార్షిక బ్రహ్మోత్సవా(brahamotsavam)ల్లో భాగంగా చివరి రోజు మంగళవారం చక్రస్నానం నిర్వహించారు. కపిలతీర్థంలోని పుష్కరిణిలో చక్రస్నానం(chakra snanam) నేత్రపర్వంగా సాగింది. ఈ సందర్భంగా భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలను ఆచరించారు. బ్రహ్మోత్సవాలల్లో భాగంగా ముందుగా శ్రీలక్ష్మణ సమేత సీతారాములవారు పల్లకిలో కపిలతీర్థా(Kapila teertam)నికి తీసుకొచ్చారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వేణుగోపాల స్వామివారి ఆలయ మండపంలో స్నపన తిరుమంజనం నిర్వహించారు.

అర్చకుల వేద మంత్రోచ్చారణ మధ్య పండితులు చక్రస్నానాన్ని(chakra snanam) శాస్త్రోక్తంగా చేపట్టారు. అనంతరం స్వామివారు గోవిందరాజ స్వామి ఉన్నత పాఠశాలలోని పీఆర్ తోటకు తీసుకొచ్చి పూజా కార్యక్రమాలను చేశారు. సాయంత్రం అక్కడి నుంచి బయల్దేరి తీర్థకట్ట వీధి, కోటకొమ్మల వీధి, కొత్త వీధి మీదుగా కోదండరామాలయానికి(kodanda rama Temple) చేరుకుంటారని ఆలయ అధికారులు తెలిపారు.
ఈ రోజు రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకూ ధ్వజాహరోహణంతో కోదండరామస్వామివారి( kodanda ramaswamy) బ్రహ్మోత్సవాలు ముగియనున్నట్లు టీటీడీ(TTD) ఆలయ అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో తిరుమల(Tirumala) పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఆలయ అర్చుకులు, భక్తులు పాల్గొన్నారు.