WGL: నెక్కొండ మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఉపేందర్ హాస్పిటల్‌ను జిల్లా వైద్యాధికారి బి. సాంబశివరావు ఆదేశాల మేరకు అధికారులు సోమవారం సీజ్ చేశారు. అనుమతులు లేకుండా ఇన్‌పేషెంట్, ఔట్‌పేషెంట్ సేవలు అందిస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించారు. గతంలో లింగ నిర్ధారణ కేసులో కూడా ఆసుపత్రిపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు తెలిపారు.