Bandi Sanjay : టీపీఎస్సీ పేపర్ వ్యవహారంలో తనకు నోటీసులు అందలేదని బీజేపీ నేత బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సిట్‌కు ఓ లేఖ రాశారు. తాను సిట్‌ను విశ్వసించడం లేదని, తనకు సిట్‌పై అసలు నమ్మకం లేదని చెప్పారు.
టీపీఎస్సీ పేపర్ వ్యవహారంలో తనకు నోటీసులు అందలేదని బీజేపీ నేత బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సిట్‌కు ఓ లేఖ రాశారు. తాను సిట్‌ను విశ్వసించడం లేదని, తనకు సిట్‌పై అసలు నమ్మకం లేదని చెప్పారు. తన దగ్గర ఉన్న సమాచారాన్ని సిట్‌కు ఇవ్వదల్చుకోలేదని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
‘నాకు నమ్మకం ఉన్న సంస్థలకే సమాచారం ఇస్తా. నాకు సిట్ నోటీసులు ఇప్పటివరకు అందలేదు. మీడియాలో వచ్చే సమాచారం మేరకే నేను స్పందిస్తున్నా. 24వ తేదీన హాజరుకావాలని సిట్ కోరినట్లు నాకు మీడియా ద్వారా తెలిసింది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న కారణంగా పార్లమెంట్ సభ్యునిగా నేను సభకు హాజరుకావాల్సి ఉంది. నేను ఖచ్చితంగా హాజరుకావాలని భావిస్తే మరో తేదీ చెప్పండి. ఈ విషయంలో నాకు పూర్తి స్వేచ్చ ఉంది’ అంటూ బండి సంజయ్ తన లేఖలో పేర్కొన్నారు.
కాగా.. కేటీఆర్ పై సైతం బండి సంజయ్ కౌంటర్లు వేశారు. ‘ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు నాకు లీగల్ నోటీసులు పంపినట్లు వార్తలు వస్తున్నాయి. అలాంటి నోటీసులకు భయపడే ప్రసక్తే లేదు. ఆ నోటీసులకు చట్టపరంగా, న్యాయబద్దంగా తగిన సమాధానం ఇస్తాం. రాజకీయంగా, ప్రజా క్షేత్రంలో పోరాడతాం. అంతే తప్ప కేసీఆర్ సర్కార్ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు. ట్విట్టర్ టిల్లును కేబినెట్ నుండి బర్తరఫ్ చేసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.
మంత్రిగా ఉంటూ ట్విట్టర్ టిల్లు స్పందిస్తే తప్పు లేనప్పుడు… ప్రజల పక్షాన పోరాడే ప్రతిపక్షంగా మేం మాట్లాడితే తప్పేముంది అని బండి సంజయ్ మంత్రి కేటీఆర్ ని ప్రశ్నించారు. ప్రతిపక్షాలకు నోటీసులిచ్చే కొత్త సాంప్రదాయానికి ట్విట్టర్ టిల్లు తెరలేపడం సిగ్గు చేటు. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ తప్పిదాలపై నోరెత్తకుండా ప్రతిపక్షాలను అణిచివేసే కుట్రలో భాగమే ఇది అని బండి సంజయ్ మండిపడ్డారు. తన వైఫల్యాలను, తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే బెదిరించడం, కేసులు పెట్టడం, తమ తాబేదారు సంస్థలతో నోటీసులు ఇప్పించడం, అరెస్ట్ చేయించడం కేసీఆర్ సర్కార్ కు అలవాటుగా మారింది. వీటికి భయపడే ప్రసక్తే లేదు అని బండి సంజయ్ తేల్చిచెప్పారు.