»Ktr Issues Legal Notices To Revanth Sanjay Over Tspsc Issue
TSPSC paper leak: బండి సంజయ్, రేవంత్‌లకు కేటీఆర్ లీగల్ నోటీసులు
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో (TSPSC paper leak) తన పైన రాజకీయ దురుద్దేశ్యంతో ఆరోపణలు చేస్తున్నారని, తనను ఈ కేసులోకి అనవసరంగా లాగుతున్నారని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (IT Minister of Telangana, K. T. Rama Rao) గురువారం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు (Telangana BJP president) బండి సంజయ్ (Bandi Sanjay), కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ (Congress Telangana chief) రేవంత్ రెడ్డిలకు (Revanth Reddy) లీగల్ నోటీసులు (Legal Notice) జారీ చేశారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో (TSPSC paper leak) తన పైన రాజకీయ దురుద్దేశ్యంతో ఆరోపణలు చేస్తున్నారని, తనను ఈ కేసులోకి అనవసరంగా లాగుతున్నారని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (IT Minister of Telangana, K. T. Rama Rao) గురువారం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు (Telangana BJP president) బండి సంజయ్ (Bandi Sanjay), కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ (Congress Telangana chief) రేవంత్ రెడ్డిలకు (Revanth Reddy) లీగల్ నోటీసులు (Legal Notice) జారీ చేశారు. ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేని తనను, తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఇందులో పేర్కొన్నారు.
స్వతంత్రంగా పరీక్షల నిర్వహణ, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాలన్న ఉద్దేశంతో ప్రభుత్వంతో సంబంధం లేకుండా టీఎస్పీఎస్సీ ఏర్పాటు అయిందని ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు. అయితే ఈ వాస్తవాలను పక్కనపెట్టి ఈ మొత్తం వ్యవహారం ప్రభుత్వ పరిధిలో జరుగుతున్న అంశంగా చిత్రీకరించే కుట్రలకు సంజయ్, రేవంత్ తెరలేపారన్నారు. తలా తోక లేకుండా మాట్లాడుతున్న ఈ రెండు పార్టీల నేతల పిచ్చి మాటల ఉచ్చులో పడకుండా యువత తమ పోటీ పరీక్షల సన్నద్ధత పైన దృష్టి సారించాలని కేటీఆర్ సూచించారు. టీఎస్పీఎస్సీ ఇప్పటికే దిద్దుబాటు చర్యలను ప్రారంభించిందని, భవిష్యత్‌లో నిర్వహించే పరీక్షలను మరింత కట్టుదిట్టంగా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించేందుకు సన్నద్ధమవుతుందన్నారు. కేవలం రాజకీయాల కోసం జరుగుతున్న దుర్మార్గపూరిత కుట్రలను, ప్రచారాన్ని నమ్మువద్దన్నారు.
నోటీసులకు భయపడేది లేదు
ట్విట్టర్ టిల్లు తనకు పంపించిన లీగల్ నోటీసులకు పంపించినట్లుగా వార్తలు వచ్చాయని, కానీ వాటికి భయపడే ప్రసక్తి లేదని బండి సంజయ్ అన్నారు. అలాంటి నోటీసులకు చట్టపరంగా, న్యాయబద్దంగా తగిన సమాధానాలు చెబుతామన్నారు. రాజకీయంగా ప్రజాక్షేత్రంలో పోరాడుతాం తప్ప కేసీఆర్ ప్రభుత్వం తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. కేటీఆర్ ను కేబినెట్ నుండి బర్తరఫ్ చేసే వరకు వదిలివేసే ప్రసక్తి లేదన్నారు. టీఎస్పీఎస్సీతో సంబంధం లేదని ట్విట్టర్ టిల్లు చెప్పడం పెద్ద జోక్ అన్నారు. ఆయనది నాలుకనా… తాటి మట్టా అని నిలదీశారు. ఏ సంబంధం లేకుంటే సమీక్షలో ఎలా పాల్గొన్నారని, లీకేజీ వెనుక ఇతరుల పాత్ర ఉందని ఎలా ఆరోపణలు చేస్తారని, అసలు రాష్ట్రంలో అన్ని శాఖల తరఫున వకాల్తా పుచ్చుకొని ఎలా మాట్లాడుతున్నారో చెప్పాలని నిలదీశారు. ఈడీ, సీబీఐకి కేంద్ర ప్రభుత్వం లింక్ పెట్టే కేటీఆర్ రాష్ట్రంలో మాత్రం తమ బాధ్యత లేదని చెప్పడం విడ్డూరమని అంటున్నారు. మంచి జరిగితే మేమే చేశామని, నష్టం జరిగితే మాకేం సంబంధం అనేలా ఉందని అంటున్నారు.