• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

అర్హులకు వెంటనే రుణాలు అందించాలి: జిల్లా కలెక్టర్

SDPT: ఏస్సీ కార్పొరేషన్ రుణాల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులకు వెంటనే రుణాలు అందించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో జరిగిన సమీక్ష సమావేశంలో, పాడి పశువులు, సోచార్ యూనిట్లకు సబ్సిడీ ఉన్నందున ఒక్క యూనిట్ కూడా మిగలకుండా గ్రౌండింగ్ చేయాలని సూచించారు.

April 8, 2026 / 09:23 AM IST

చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి: MLA

BHPL: చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో CCPL సీజన్-4 క్రికెట్ టోర్నమెంట్‌ను మంగళవారం సాయంత్రం MLA గండ్ర సత్యనారాయణ రావు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా MLA గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.

April 8, 2026 / 09:20 AM IST

‘నీటి ఎద్దడి నివారణకు నీటి చెల్మల ఏర్పాటు’

మంచిర్యాల: దండేపల్లి మండలంలోని తాళ్లపేట అటవీ రేంజ్ పరిధిలో ఉన్న అడవులలో నీటి సమస్య ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నామని స్థానిక ఎఫ్ఆర్ఓ సుష్మారావు తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. సింగరాయపేట్, దమ్మన్నపేట తదితర అటవీ ప్రాంతాలలో నీరు లభించక వన్యప్రాణులు ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు. అడవులలో ఉండే వాగుల వద్ద నీటి చెల్మలను ఏర్పాటు చేశామని ఎఫ్ఆర్ఓ వివరించారు.

April 8, 2026 / 09:19 AM IST

కొడంగల్‌లో సబ్సిడీపై పశుగ్రాస విత్తనాలు

VKB: కొడంగల్‌లో 75% సబ్సిడీపై ప్రభుత్వం రైతులకు పశుగ్రాస విత్తనాలను అందిస్తుంది. 5 కేజీల బ్యాగును 75శాతం సబ్సిడీ పోనూ రూ.128.75కు అందించనున్నట్లు కొడంగల్ పశువైద్య శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ నోహ తెలిపారు. విత్తనాలు కావాల్సిన రైతులు పట్టా పాస్‌బుక్, ఆధార్ కార్డు జిరాక్స్‌ను కొడంగల్ పశువైద్యశాలలో అందించి తీసుకువెళ్లాలని పేర్కొన్నారు.

April 8, 2026 / 09:18 AM IST

‘మంత్రి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక’

PDPL: ధర్మారం మండలం చామనపల్లి వార్డు సభ్యులు, BJP నాయకుడు దాసరి సాగర్ సర్పంచ్ వేల్పుల రేవతి నాగరాజు ఆధ్వర్యంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు ధర్మపురి క్యాంపు ఆఫీసులో లక్ష్మణ్ కుమార్ ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రాజేందర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.

April 8, 2026 / 09:16 AM IST

ములుగులో ఈవీఎం గోదాం తనిఖీ

ములుగు పట్టణంలోని కలెక్టరేట్‌లో ఈవీఎం గోదాంను కలెక్టర్ దివాకర టీఎస్ నెలవారీగా తనిఖీ చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోదాం సీల్, సీసీ కెమెరాలు, అగ్నిమాపక పరికరాల పనితీరును పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు, రిజిస్టర్లు, పోలీస్ బందోబస్తును కూడా తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఈవీఎంల భద్రతకు పూర్తి పారదర్శకత పాటిస్తున్నామని తెలిపారు.

April 8, 2026 / 09:14 AM IST

నేడు ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యటన

MNCL: పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ ఇవాళ మంచిర్యాలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మధ్యాహ్నం 3.15 గంటలకు మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో అమృత్ భారత్ పథకం కింద జరుగుతున్న రినోవేషన్ పనులను పరిశీలిస్తారు. అనంతరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థులకు క్రీడలకు సంబంధించిన కిట్లు పంపిణీ చేయనున్నారు.

April 8, 2026 / 09:08 AM IST

జాతీయస్థాయి రోయింగ్ పోటీలకు కానిస్టేబుల్ ఎంపిక

KNR: జమ్మికుంట పట్టణం కేశవపురం 15వ వార్డుకి చెందిన పాతకాల ప్రశాంత్ జాతీయ స్థాయి రోయింగ్ పోటీలకు ఎంపికయ్యారు. ఏప్రిల్ 8 నుంచి 12 వరకు ఒడిశాలోని కటక్ నగరంలో నిర్వహించనున్న ఫస్ట్ ఆల్ ఇండియా ఇండోర్ రోయింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్రం తరఫున పాల్గొననున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో SPF కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రశాంత్ పలు పథకాలు సాధించాడు

April 8, 2026 / 09:07 AM IST

మునుగోడులో 7.32 ఎకరాల భూమి స్వాధీనం

NLG: మునుగోడు మండలంలో అక్రమణకు గురైన 7.32 ఎకరాల సాగు భూమిని రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం విజయవంతంగా విముక్తి చేసింది. ఆర్డీవో శ్రీదేవి పర్యవేక్షణలో జరిగిన ఈ ఆపరేషన్లో ఆక్రమణలను తొలగించి, భూమిని తిరిగి అర్హులైన రైతులకు అప్పగించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.

April 8, 2026 / 09:06 AM IST

కొత్త బస్టాండ్‌లో బస్సు షెల్టర్ సేవలు ప్రారంభం

వనపర్తి కొత్త బస్టాండ్ ఆవరణలో ప్రయాణికుల సౌకర్యార్థం గోనూరు వెంకటయ్య తల్లిదండ్రులు గోనూరు బాలమ్మ రామచంద్రయ్యల జ్ఞాపకార్థం బస్సు షెల్టర్‌ను ఏర్పాటు చేశారు. ఈ బస్సు షెల్టర్‌ను ఈరోజు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎంపీ మల్లు రవి స్థానిక ఎమ్మెల్యే మేఘా రెడ్డిలు లాంఛరంగా ప్రారంభించనున్నారని డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ తెలిపారు.

April 8, 2026 / 09:03 AM IST

కోటేశ్వర ఆలయం వద్ద పుష్కరాల ఏర్పాట్ల సమీక్ష

JGL: వెల్గటూర్ మండలం కోటిలింగాల కోటేశ్వర ఆలయం వద్ద జరగబోయే పుష్కరాల ఏర్పాట్లను జిల్లా స్థాయి అధికారులు పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశించారు. తాగునీరు, పారిశుధ్యం, భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

April 8, 2026 / 09:02 AM IST

ఏజెన్సీలో తీరని దాహం.. అందని శుద్ధ జలం

ADB: ఉట్నూర్ ITDAకు చేరువలో ఉన్న గిరిజన గ్రామాలు నేటికీ రక్షిత తాగునీటికి దూరంగా ఉన్నాయి. ప్రతి ఇంటికీ భగీరథ నీరు అందిస్తామని ప్రభుత్వం చెబుతున్నా బావులు, చేతిపంపుల నీటినే ఆశ్రయిస్తున్నారు. కలుషిత నీటితో అనారోగ్య పాలవుతున్నామని, ప్రతి గ్రామంలో శుద్ధ జల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఏజెన్సీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.

April 8, 2026 / 09:01 AM IST

అక్రమ గుడుంబా విక్రయం.. మహిళపై కేసు నమోదు

WGL: గీసుగొండ మండలం ఏలుకుర్తి గ్రామంలో అక్రమంగా గుడుంబా విక్రయిస్తున్నారని సమాచారం మేరకు CI విశ్వేశ్వర్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం పోలీసులు ఆకస్మిక దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో మణెమ్మ అనే మహిళ ఇంట్లో సోదాలు చేపట్టగా.. ఆమె వద్ద నుంచి 4 లీటర్ల నిషేధిత గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

April 8, 2026 / 08:56 AM IST

‘వేసవికి ముందస్తు ఏర్పాట్లు’

NRPT: ఊట్కూర్ మండలం గ్రామాల్లో వేసవిలో నీటి తేమ, విద్యుత్ సమస్యలు రాకుండా ఎంపీడీవో కొండన్న ముందు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందికి బాధ్యతగా పనిచేయాలని, ఇళ్లు వేగంగా నిర్మించటం, పన్నుల వసూళ్లు సమర్థంగా నిర్వహించటం అవసరమని ఆదేశించారు.

April 8, 2026 / 08:54 AM IST

సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి భారీ విరాళం

WGL: పర్వతగిరి మండలం రోళ్లకల్లు గ్రామంలో నిర్మిస్తున్న సేవాలాల్ మహారాజ్ ఆలయానికి హనుమకొండ ఆర్టీసీ డిపో ఏవో లూనావత్ రవీందర్ రూ. 50 వేల విరాళం ఇవాళ అందించారు. ఆలయ నిర్మాణంతో పాటు మేరమా యాడి ఆలయాన్ని కూడా నిర్మిస్తున్నట్లు కమిటీ గౌరవ అధ్యక్షుడు జాటోతు శ్రీనివాస్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవిమంగ్యా నాయక్, నాగపురి లింగం, మంజుల శ్రీనివాస్ పాల్గొన్నారు.

April 8, 2026 / 08:49 AM IST