బండి సంజయ్ నోటి దూలతో గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చాలానే చేశారు. హిందూవులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. గతంలో ధర్మపురి అరవింద్ కూడా కవితను ఉద్దేశించి వ్యక్తిగతంగా అసభ్య వ్యాఖ్యలు చేశాడు.
తెలంగాణ (Telangana) ఎమ్మెల్సీ, భారత్ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha)పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. గతంలో చేసిన వ్యాఖ్యలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. కవితను దుర్భాషలాడుతూ రెచ్చిపోయారు. ఈ క్రమంలోనే ఆమెను అరెస్ట్ చేయకపోతే.. ***ద్దు పెట్టుకుంటారా అని ఎదురు ప్రశ్నించారు. ఆలస్యంగా ఈ వ్యాఖ్యలు వెలుగులోకి రావడంతో మంత్రులు, భారత రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi- BRS Party) బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళపై అనుచిత వ్యాఖ్యలు (Indecent Ccomments) చేయడం తగదని హెచ్చరించారు. మరికొందరు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నట్లు సమాచారం.
మార్చి 8న హైదరాబాద్ (Hyderabad)లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు (International Women’s Day) నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతున్న సమయంలో కవిత అంశంపై స్పందించారు. ‘కవిత బతుకమ్మ (Bathukamma) పేరుతో తెలంగాణ సాంస్కృతిని దెబ్బ తీసింది. చెప్పులు, హ్యాండ్ బ్యాగులు పెట్టించి కృతిమ పూలు, డీజే పాటలతో బతుకమ్మ అడించి విలువ తీసేసింది. కవితను అరెస్ట్ చేయకపోతే ముద్దు పెట్టుకుంటారా? కేసీఆర్ కుటుంబంలో ఒక వికెట్ క్లీన్ బౌల్డ్. కవిత చేసిన దొంగ సారా దందా.. కేసీఆర్ కు నచ్చిన స్కీం. కవిత తెలంగాణ మహిళలు తల దించుకునేలా చేసింది. నరేంద్ర మోదీ ప్రధాని అయిన సంవత్సరమే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్ర మహిళల కోసం కేసీఆర్ ఏమీ చేశారో ఆలోచించాలి. బీఆర్ఎస్ కు మహిళా కమిటీలే లేవు.. పార్టీ మహిళా అధ్యక్షురాలు ఎవరూ? బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీలో ఎంత మంది మహిళలు ఉన్నారు? మహిళలకు ప్రభుత్వంలో పార్టీలో పదవులు ఇచ్చి గౌరవించే పార్టీ మాది. వంట గదికే పరిమితమైన యాదమ్మ ప్రధానికి వంట చేసే స్థాయికి ఎదిగింది’ అంటూ బండి సంజయ్ మాట్లాడారు.
ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బండి సంజయ్ వ్యాఖ్యలపై గులాబీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ వద్ద సంజయ్ దిష్టిబొమ్మ తగలబెట్టారు. అయితే 144 సెక్షన్ అమల్లో ఉండడంతో వారి ఆందోళనను పోలీసులు అడ్డగించారు. అయినా బీఆర్ఎస్ పార్టీ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. తెలంగాణలో కూడా ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. కాగా బండి వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ కు కూడా ఫిర్యాదు చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. వెంటనే కవితకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మహిళలకు బీజేపీ ఇచ్చే మర్యాద ఇదేనా? అని నిలదీస్తున్నారు. కాగా బండి సంజయ్ నోటి దూలతో గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చాలానే చేశారు. హిందూవులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. గతంలో ధర్మపురి అరవింద్ కూడా కవితను ఉద్దేశించి వ్యక్తిగతంగా అసభ్య వ్యాఖ్యలు చేశాడు.