KMM: మధిర మండలం దెందుకూరు గ్రామ పంచాయతీకి నూతనంగా ఎన్నికైన పాలకవర్గాన్ని Dy. CM భట్టి విక్రమార్క సతీమణి నందిని శనివారం అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామ సమస్యలను గుర్తించి, దెందుకూరును సమగ్రంగా అభివృద్ధి చేసి చూపించాలని పాలకవర్గానికి సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.