WGL: రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా పలు పోలింగ్ కేంద్రాలను గ్రీన్ పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద శనివారం తెలిపారు. ఈ నెల 14న నాలుగు గీసుకొండ, దుగ్గొండి, నల్లబెల్లి, సంగెం మండలాల్లో ప్రతి మండలానికి రెండు చొప్పున హరిత పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.