»Brs Party Once More Comes Into Power Says Telangana Mlc Kalvakuntla Kavitha
Kavitha మాపై పోటీ అంటే మైసమ్మ ముంగిట మేకపోతును కట్టేసినట్టే: ఎమ్మెల్సీ కవిత
ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీని అవహేళన చేశారు.. కానీ ఇప్పుడు అదే పార్టీ ఇంటికి మూడు పథకాలు అందిచే స్థాయికి ఎదిగిందని తెలిపారు. కార్యకర్తలు చిందించిన స్వేధం చెరువుల్లో కనిపిస్తున్న నీటి చుక్కలు. మీ త్యాగమే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు రూపంలో తెలంగాణ మొత్తానికి నీటికుండలాగా తరతరాలను ఆదుకునే ప్రాజెక్టు అని పేర్కొన్నారు.
తెలంగాణ (Telangana) ప్రజల సంక్షేమం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని ఎమ్మెల్సీ, భారత్ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) స్పష్టం చేశారు. దేశంలో ఇప్పటివరకు ఎవరూ చేయలేనన్ని మంచి పనులు సీఎం కేసీఆర్ (KCR) చేసి చూపించారని తెలిపారు. ఇదే క్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి (Jeevan Reddy) అద్భుత మెజార్టీతో గెలుస్తాడని.. అతడిపై పోటీ అంటే మైసమ్మ ముంగట మేకపోతును కట్టేసినట్టేనని పేర్కొన్నారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ (Armoor) నియోజకవర్గంలోని మాక్లూర్ (Makloor)లో మంగళవారం బీఆర్ఎస్ (BRS Party) ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మంత్రి మల్లారెడ్డి (Malla Reddy), ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో కలిసి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీని అవహేళన చేశారు.. కానీ ఇప్పుడు అదే పార్టీ ఇంటికి మూడు పథకాలు అందిచే స్థాయికి ఎదిగిందని తెలిపారు. ఈ సందర్భంగా కార్యకర్తలు (Karyakartas) చేసిన త్యాగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మీరు చేసిన త్యాగం ఇవాళ తెలంగాణలో ఇస్తున్న ప్రతి పథకంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) కార్యకర్తలు చిందించిన స్వేధం చెరువుల్లో కనిపిస్తున్న నీటి చుక్కలు. మీ త్యాగమే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు రూపంలో తెలంగాణ మొత్తానికి నీటికుండలాగా తరతరాలను ఆదుకునే ప్రాజెక్టు’ అని పేర్కొన్నారు.
‘బీఆర్ఎస్ కేవలం రాజకీయ పార్టీ కాదు. ఎంతో కష్టం.. కోపం.. ఆవేదన, ప్రేమతో (Love) పుట్టుకువచ్చిన పార్టీ. ప్రజలను బాగు చేయాలని భావించిన పార్టీ’గా కవిత తెలిపారు. రాబోయే ఎన్నికల (Elections) కోసం మరింత బాధ్యతగా పని చేద్దామని పిలుపునిచ్చారు. ‘సీఎం కేసీఆర్ లక్ష్యాన్ని, తెలంగాణ ప్రజల ఆశయాలు (People), అమరవీరుల త్యాగాలను, జయశంకర్ స్ఫూర్తి తీసుకుని ముందుకు వెళ్తున్న పార్టీ బీఆర్ఎస్’ అని తెలిపారు. తమకు రాజకీయ ఆలోచనలు లేవని, ప్రజలకు మంచి చేయాలనేదే ప్రధాన ఆలోచన అని వెల్లడించారు.