»I Love You Is Last Message Sent To Her Boyfriend At Kongara Kalan
Kongara Kalan ‘ఐ లవ్యూ.. లాస్ట్ మెసేజ్‘ అని లవర్ కు పంపి ఆత్మహత్య
అంతకుముందు క్రాంతికి ‘ఐ లవ్యూ.. లాస్ట్ మెసేజ్’ అని వాట్సప్ సందేశం పంపింది. అనంతరం ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో భయాందోళన చెందిన క్రాంతి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తల్లిదండ్రులు, పోలీసులు గాలించగా గ్రామ శివారులో అచేతనావస్థలో కనిపించింది.
ప్రియుడి (Lover) వేధింపులు భరించలేక ఓ యువతి (Young Girl) ఆత్మహత్య చేసుకుంది. నీ బాగోతం అంతా నాకు తెలుసు.. అందరికీ చెప్పి పరువు తీస్తానని ప్రియుడు వేధించడంతో యువతి మనస్తాపం చెందింది. తన పరువు పోతుందని కలత చెందిన ఆమె బలవన్మరణా (Suicide)నికి పాల్పడింది. ఈ సంఘటన తెలంగాణ (Telangana)లోని రంగారెడ్డి జిల్లా (RangaReddy District)లో చోటుచేసుకుంది. ఆదిబట్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ (Kongara Kalan) తండాకు చెందిన అంగోతు సరిత, అంతిరాం దంపతుల కుమార్తె పల్లవి (21). అమ్యూజ్ మెంట్ పార్క్ వండర్ లా(Wonderla)లో ఉద్యోగం చేస్తుండేది. హైదరాబాద్ (Hyderabad)లోని మూసాపేటకు చెందిన ఎలుక క్రాంతి (Kranthi) కొంగరకలాన్ లో ఉంటున్న అమ్మమ్మ వద్ద నివసిస్తున్నాడు. ఈ క్రమంలో పల్లవి క్రాంతి పరిచయమయ్యాడు. రెండేళ్ల నుంచి వీరి మధ్య ప్రేమ కొనసాగుతుంది. వీరు ప్రేమించుకుంటున్న సమయంలోనే పల్లవి ఒకరితో చాటింగ్ చేస్తుండడాన్ని క్రాంతి చూశాడు. వండర్ లాలో పని చేసే ప్రణయ్ (Pranay)తో పల్లవి చనువుగా ఉంటుందని అనుమానించాడు. ఫోన్లు, చాటింగ్ చేస్తోందని క్రాంతి అనుమానాలు పెంచుకున్నాడు. రెండు నెలలుగా వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.
తరచూ ఇదే విషయమై గొడవపడుతున్నారు. ఈ సమయంలో గురువారం పల్లవి, క్రాంతి కలుసుకున్నారు. స్థానికంగా ఉన్న సాయిబాబా గుడి వద్దకు వచ్చారు. ‘నీ బాగోతం అంతా నాకు తెలుసు. నీ విషయం అందరికీ చెప్పి పరువు తీస్తా’ అని బెదిరింపులకు పాల్పడ్డాడు. అనంతరం ఛీ కొట్టి వెళ్లిపోయాడు. దీంతో పల్లవి మనస్తాపానికి గురైంది. ఇంటికి వెళ్లి ప్రాణం తీసుకోవాలని భావించింది. ఇంట్లో పరిస్థితులు కుదరక గ్రామ శివారుకు వెళ్లింది. అక్కడ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అంతకుముందు క్రాంతికి ‘ఐ లవ్యూ.. లాస్ట్ మెసేజ్’ అని వాట్సప్ సందేశం పంపింది. అనంతరం ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో భయాందోళన చెందిన క్రాంతి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తల్లిదండ్రులు, పోలీసులు గాలించగా గ్రామ శివారులో అచేతనావస్థలో కనిపించింది. కాగా క్రాంతి, ప్రణయ్ లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.