»Nellore Nuda Chairman Mukkala Dwarakanath Sent His Daughter In Helicopter
Helicopter బిడ్డను అత్తారింటికి హెలికాప్టర్ లో పంపిన తండ్రి
ఆయనపై నెల్లూరు అవినీతి ఆరోపణలు చాలా ఉన్నాయి. ఈసారి నెల్లూరు ఎమ్మెల్యే (MLA)గా పోటీ చేయాలని ద్వారకనాథ్ భావిస్తున్నాడు. టికెట్ కోసం పార్టీ ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నాడు.
పెళ్లంటే నూరేండ్ల పంట. అంతస్తుకు మించి పెళ్లి చేసుకోవాలని అందరూ భావిస్తారు. దీనికోసం అప్పులు చేసి మరీ వివాహం (Marriage) అంగరంగ వైభవంగా చేయాలని చూస్తారు. ఇక సంపన్నులైతే తమ స్తోమత చూపించుకునేందుకు భారీ స్థాయిలో వివాహం జరిపిస్తారు. వందల వంటలు.. కనులవిందుగా అలంకరణ.. రిటర్న్ గిఫ్ట్స్ వంటి వాటితో పెళ్లి వేడుక చేస్తారు. ఇక ఆడపిల్లల తల్లిదండ్రులు తమ కూతురు అత్తారింటికి వెళ్తే భారీ కానుకలతో సాగనంపుతారు. చీరసారెలు భారీగా పెట్టిపోతలు పెట్టి పంపుతారు. ఈ ధోరణి కొత్త పుంతలు తొక్కుతోంది. తమ అంతస్తు చూపించుకునేందుకు.. దాంతోపాటు తమ వారిపై ప్రేమ చూపించుకునేందుకు భారీ ఖర్చు (Cost)కు వెనుకాడడం లేదు. ఈ క్రమంలోనే ఓ తండ్రి (Father) తన కూతురు (Daughter)ని అత్తారింటికి హెలికాప్టర్ లో సాగనంపారు. వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీ (Andhra Pradesh)లోని నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ (నుడా) (Nellore Urban Development Authority- NUDA) చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ (Mukkala Dwarakanath) కుమార్తె ఉషశ్రీ (Usha Sri). ఆమెను హైదరాబాద్ (Hyderabad)కు చెందిన ప్రశాంత్ (Prashanth)తో వైభవంగా వివాహం జరిపించారు. కనివినీ ఎరుగని రీతిలో పెళ్లి చేయించారు. ఇక వివాహ అనంతరం అత్తారింటికి వెళ్లే సమయం వచ్చింది. తన కూతురును ఆషామాషీగా పంపిస్తానని భావించి ఆకాశంలో పంపించాడు. కుమార్తెను అత్తారింటికి పంపేందుకు హెలికాప్టర్ ను అద్దెకు తీసుకున్నాడు. నెల్లూరు నుంచి విజయవాడ (Vijayawada)కు కూతురు ఉషశ్రీని అల్లుడు ప్రశాంత్ తో హెలికాప్టర్ పంపించారు. కాగా హెలికాప్టర్ కోసం ప్రత్యేకంగా హెలీప్యాడ్ తయారు చేయించారు.
వీరు హెలికాప్టర్ లో వెళ్లడం స్థానికంగా చర్చనీయాంశమైంది. కాగా ద్వారకానాథ్ ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. వైఎస్సార్ సీపీ (YSRCP) నాయకుడిగా కొనసాగుతున్న ద్వారకనాథ్ వైఎస్ జగన్ (YS Jagan) అంటే అభిమానం. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఏకంగా 418 కిలోల వెండి ఆభరణాలతో జగన్ చిత్రపటం రూపొందించి ప్రత్యేకత చాటుకున్నాడు. కాగా ఆయనపై నెల్లూరు అవినీతి ఆరోపణలు చాలా ఉన్నాయి. ఈసారి నెల్లూరు ఎమ్మెల్యే (MLA)గా పోటీ చేయాలని ద్వారకనాథ్ భావిస్తున్నాడు. టికెట్ కోసం పార్టీ ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నాడు.