Helicopter Crashes: రష్యా దేశానికి చెందిన మిలిటరీ హెలికాప్టర్ (Russian Military Helicopter) క్రాష్ అయింది. ఈ ప్రమాదానికి కారణం సాంకేతిక లోపం అని అధికారులు తెలిపారు. దాంతో గాల్లోనే కుప్పకూలిపోయింది (Helicopter Crashes). ఈ ప్రమాదంలో సిబ్బంది మృతి చెందారు. నైరుతి రష్యాలోని జనావాసాలు ఎవరు లేని ప్రాంతంలోనే హెలికాప్టర్ ధ్వంసం అయినట్లు స్థానికి మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
రష్యాకు చెందిన ఎంఐ – 28 మిలిటరీ హెలికాప్టర్ (Mi 28 Military Helicopter) గురువారం ఉదయం క్రాష్ అయిందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ హెలికాప్టర్ కలుగ ప్రాంతంలో క్రాష్ అయినట్లు వెల్లడించింది. ఈ దర్ఘటనలో సిబ్బంది మరణించినట్లు (Crew Dead) పేర్కొంది. కలుగ ప్రాంతంలో ఒక ఎంఐ – 28 క్రాష్ అయినట్లు మంత్రి తెలిపారు. ఉక్రెయిన్ సరిహద్దు నుంచి 150 కిలోమీటర్ల (93 మైళ్ల) దూరంలో అడవిలో కుప్ప కూలింది. సాంకేతిక లోపమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక సమాచారంలో తేలిందని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారి తెలిపినట్లు మీడియా వెల్లడించింది.