»Hollywood Star Actor Johnny Wactor Killed Shot Dead In Attempted Theft
Johnny Wactor: హాలీవుడ్ స్టార్ నటుడు జానీ వాక్టర్ దారుణ హత్య
హాలీవుడ్ యాక్టర్ దారుణంగా చంపబడ్డ ఘటన వెలుగులోకి వచ్చింది. తన కారులో దోపిడికి ప్రయత్నించిన దుండగులు జనరల్ హాస్పిటల్ ఫేమ్ నటుడు జాన్నీ వాక్టర్‌ను కాల్చి చంపారు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్‌గా మారింది.
Hollywood Star Actor Johnny Wactor Killed. Shot Dead In Attempted Theft
Johnny Wactor: అమెరికాలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ హాలీవుడ్ నటుడు మరణించాడు. జనరల్ హాస్పిటల్ అనే చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జాన్నీ వాక్టర్ అనే నటుడిని దుండగులు కాల్చి చంపారు. 37 ఏళ్ల వయసున్న ఆయన కారులో ప్రయాణిస్తుండగా ఈ దారుణం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికా కాలమానం ప్రకారం శనివారం తెల్లవారు జామున 3 గంటలకు ఈ జాన్నీ వాక్టర్ తన కారులో ప్రయాణిస్తున్నారు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ డౌన్టౌన్లో ఓ ముగ్గురు ఆగంతకులు అతని కారును వెంబడించినట్లు వాక్టర్ తల్లి స్కార్లెట్ పోలీసులకు వివరించారు.
ముగ్గురు దుండగులు వాక్టర్ కారును వెంబడించి ఆపారు. కారులోని కాటలిక్ట్ కన్వర్టర్‌ను దొంగిలించడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో వాక్టర్ వారించాడు. దాంతో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఒక రౌండ్ కాల్పులు జరిపి దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. గాయపడ్డ వాక్టర్ ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తల్లి స్కార్లెట్ పేర్కొన్నారు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు నిందితులను తీవ్రంగా వెతుకుతున్నారు. ఇప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. జాన్నీ వాక్టర్ 2007లో వచ్చిన లైఫ్‌టైమ్ డ్రామా సిరీస్ ‘ఆర్మీ వైవ్స్’ అనే టీవీ షోతో పేరు తెచ్చుకున్నారు. అలా తన యాక్టింగ్ కెరియర్ను కొనసాగిస్తూ జనరల్ హాస్పిటల్ అనే షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన మరణం వార్త విన్న తోటి నటులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.