»Helicopter Turned In The Wind At Kedarnath Temple Devotees Ran Video Viral
Kedarnath temple: కేదార్నాథ్ ఆలయం వద్ద గాల్లో తిరిగిన హెలికాప్టర్.. పరుగు తీసిన భక్తులు.. వీడియో వైరల్
కేదార్నాథ్ ఆలయం సమీపంలో ఓ హెలికాప్టర్‌కు పెను ప్రమాదం తప్పింది. గాల్లో ఉన్న హెలికాప్టర్ ల్యాండ్ అవకుండా గింగిరాలు తిరిగింది. దీంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతుంది.
Helicopter turned in the wind at Kedarnath temple.. Devotees ran.. Video viral
Kedarnath temple: ఓ హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో సాంకేతిక కారణాలు తలెత్తాయి. దాంతో గాల్లోనే గింగిరాలు తిరిగింది. అది చూసిన ప్రజలు, సిబ్బంది భయాందోళనలతో పరుగెత్తారు. ఈ సంఘటన ఈరోజు ఉదయం కేదార్నాథ్ ఆలయం సమీపంలో చోటుచేసుకుంది. ల్యాండింగ్ సమయంలో ఓ హెలికాప్టర్ గాల్లో గింగిర్లు కొట్టి స్థానికులను ప్రాణ భయంతో పరుగు పెట్టేలా చేసింది. వెంటనే పైలట్ అలెర్ట్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. అప్పటి వరకు భయంతో పరుగులు పెట్టిన భక్తులు పైలట్ చాకచక్యంగా సేఫ్‌గా ల్యాండింగ్ చేయడంతో ఊపిరిపీల్చుకున్నారు.
సాధారణంగా ఆలయం దగ్గరకు వెళ్లాలంటే భక్తులు కొండలు మార్గంగా ట్రెకింగ్ చేయాలి. అలా సాహసం చేయలేని భక్తులు హెలికాప్టర్లో ఆలయం వద్దకు చేరుకుంటారు. శుక్రవారం ఉదయం పైలట్, ఏడుగురు భక్తులతో సిర్సి హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్ కేదార్నాథ్ స్టార్ట్ అయింది. టేకాఫ్ అవడంతోనే సాంకేతిక కారణాలతో అత్యవసరంగా ల్యాండ్ అయింది. అది ల్యాండ్ అయే సమయంలో గింగిరాలు తిరగడంతో అందరూ కంగారు పడ్డారు. తరువాత ల్యాండ్ కావాల్సిన ఏరియాకు కొంత దూరంలో సేఫ్ ల్యాండ్ అయింది. దీంతో హెలికాప్టర్లో ఉన్న వారు సేఫ్‌గా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.