»Kamya Karthikeyan Is A 16 Year Old Indian Teenager Who Climbed Everest
Kamya Karthikeyan: ఎవరెస్ట్ ఎక్కిన 16 ఏళ్ల అమ్మాయి.. కొత్త రికార్డు
అతి చిన్న వయసులో మౌంట్ ఎరవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన భారతీయ అమ్మాయిగా కామ్యా కార్తికేయన్ సరికొత్త రికార్డును సృష్టించింది. నేవిలో పనిచేసే తన తండ్రితో కలిసి ఈ ఫీట్ సాధించింది. ఈ మేరకు భారత నౌకాదళానికి చెందిన వెస్టర్న్ నేవల్ కమాండ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.
Kamya Karthikeyan is a 16-year-old Indian teenager who climbed Everest
Kamya Karthikeyan: అతి చిన్నవయస్సులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన భారతీయ అమ్మాయిగా కామ్యా కార్తికేయన్ నిలిచింది. భారతదేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో నివాసం ఉంటుంది. వయస్సు కేవలం 16 ఏళ్లే అయినా సరే కామ్యా కార్తికేయన్ అసాధారణ రికార్డు నెలకొల్పింది. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన శిఖరం మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించిన తొలి భారత పిన్నవయస్కురాలిగా
రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ రికార్డు సాధించిన రెండో అతిపిన్న వయస్కురాలిగా నిలిచింది. కామ్యా తండ్రి ఎస్. కార్తికేయన్ భారత నౌకాదళంలో పనిచేస్తారు. ఆయనతో కలిసి మే 20న నేపాల్ నుంచి ఈ శిఖరాన్ని ఎక్కింది. ఇదే విషయాన్ని భారత నౌకాదళానికి చెందిన వెస్టర్న్ నేవల్ కమాండ్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది.
‘కామ్యా అసాధారణ ప్రతిభ కలిగిన అమ్మాయి. ఇప్పటికే ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఉన్న ఆరు శిఖరాలను అధిరోహించింది. చివరిగా అంటార్కిటికా ఖండంలోని మౌంట్ విన్సన్ మాస్సిఫ్ పర్వత శిఖరాన్ని ఈ ఏడాది డిసెంబర్లో అధిరోహించే అవకాశం ఉంది. దాంతో మొత్తం ఏడు ఖండాల్లోని ఎత్తైన శిఖరాన్ని అధిరోహిస్తుందని ఇండియన్ నేవీ పోస్ట్ పెట్టింది. కామ్యా కార్తికేయన్ ప్రస్తుతం ముంబైలోని నేవీ చిల్డ్రన్ స్కూల్లో 12వ తరగతి చదువుతోంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ 2020 ఫిబ్రవరిలో మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో కామ్యా పేరును ప్రస్తావించి తాను అందరికీ స్ఫూర్తిదాయకం అని ప్రశంసించారు. తరువాత 2021లో మోడీతో కామ్యా వర్చువల్‌గా మాట్లాడింది. ఈ సందర్భంగా రాష్ట్రీయ బాల పురస్కారం అందుకున్నందుకు ఆమెను అభినందించారు.