Janhvi Kapoor climbed the stairs of Tirumala on her knees
Janhvi Kapoor: అతిలోకసుందరి శ్రీదేవి, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ల కూతురు అందాల భామ జాన్వీ కపూర్(Janhvi Kapoor) గురించి అందరికీ తెలిసిందే. తనకు గ్లామరే కాదు ఆధ్యాత్మికత కూడా ఎక్కువే. అందుకే సమయం దొరికినప్పుడల్లా తిరుమల దర్శనం చేసుకుంటుంది. అయితే తన పుట్టిన రోజు సందర్భంగా మార్చి 6న తిరుమలను దర్శికుంది. ఈ సందర్భంగా తాను మోకాళ్ల మొట్లు ఎక్కినట్లు వివరించింది. దీనికి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట్లో దర్శనం ఇచ్చింది.
తనపుట్టిన రోజు నాడు ముంబై నుంచి కార్లో 3 గంటల జర్నీ చేసి తిరుమలకు చేరుకున్నట్లు చెప్పుకొచ్చారు. తనతో పాటు తన స్నేహితులు శిఖర్ పహారియా, ఒరీ కూడా ఉన్నారు. వీరితో పాటు కాలినడక మెట్లు ఎక్కి మిట్ట వద్దకు చేరుకున్నారు. అక్కడ నుంచి శిఖర్, జాన్వీ మోకాళ్లతో మెట్లు ఎక్కినట్లు తెలిపారు. తిరుపతి అంటే చాలా ఇష్టమని ఇప్పటి వరకు ఇక్కడకు 50 సార్లకు పైగానే వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తెలుగులో దేవర షూటింగ్ దశలో ఉండగా, తాజాగా రామ్ చరణ్ హీరోగా ఆర్సీ16 పూజాకార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర కావాలని ప్రయత్నిస్తోంది.