ss karthikeya Earthquake : రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ జపాన్‌లో వచ్చిన భూకంపం నుంచి సేఫ్‌గా బయట పడినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్ ఖాతా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం రాజమౌళి(Rajamouli) కుటుంబం అంతా జపాన్‌లో(Japan) ఉంది. ఆర్ఆర్ఆర్ స్క్రీనింగ్ కోసం వారంతా అక్కడికి వెళ్లారు. భూకంపం విషయమై కార్తికేయ మాట్లాడుతూ… తాను 28 ఫ్లోర్లో ఉన్నప్పుడు భూమి కదులుతున్నట్లుగా అనిపించిందన్నారు. ఒక నిమిషం ఏం జరిగిందో అర్థం కాలేదు కానీ తర్వాత అది భూకంపం అని అర్థమైందన్నారు. దీంతో తాను చాలా భయపడ్డానని చెప్పారు. అయితే స్థానికంగా ఉన్న జపనీయులు మాత్రం ఏదో వర్షం పడుతున్నప్పుడు ఉన్నంత క్యాజువల్‌గా ఉన్నారని ట్వీట్ చేశారు.
మొత్తానికి తాము భూకంపాన్ని ఎక్స్పీరియన్స్ చేశామని కార్తికేయ( SS Karthikeya) రాసుకొచ్చారు. భూకంపం సమయంలో తన స్మార్ట్ వాచ్‌లో వచ్చిన వార్నింగ్ ఫోటోను ఫోటో తీసి దాన్ని ఈ ట్వీట్‌కి యాడ్ చేశారు. దీంతో రాజమౌళి కుటుంబం సేఫ్‌గా ఇంటికి తిరిగి రావాలని కామెంట్స్ చేస్తున్నారు. జపాన్‌లో వచ్చిన భూకంపం తీవ్రత 5.3గా నమోదు అయినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. తూర్పు జపాన్‌లోని దక్షిణ ఇబారకి ప్రిపెక్చర్లో 46 మీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్లు అక్కడి వాతావరణ సంస్థ తెలిపింది. దీని వల్ల ఎలాంటి ప్రాణ నష్టమూ చోటు చేసుకోలేదని వెల్లడించింది.
Felt a freaking earthquake in Japan just now!!! Was on the 28th floor and slowly the ground started to move and took us a while to realise it was an earthquake. I was just about to panic but all the Japanese around did not budge as if it just started to rain!! 😅😅😅😅😅… pic.twitter.com/7rXhrWSx3D