»Kami Rita Sherpa Broke Her Record By Climbing Everest For The 27th Time
Kami Rita Sherpa: 27వ సారి ఎవరెస్ట్ ఎక్కి..తన రికార్డు బ్రేక్
నేపాలీ షెర్పా(53)(Kami Rita Sherpa) బుధవారం నాడు ఎవరెస్ట్(Everest) శిఖరాన్ని 27వ సారి(27th time) ఎక్కి తన రికార్డును తానే బ్రేక్ చేశాడు. ఈ మేరకు అక్కడి అధికారులు విషయాన్ని ప్రకటించారు.
నేపాల్ కు చెందిన కమీ రీటా షెర్పా(53)(Kami Rita Sherpa) బుధవారం నాడు మళ్లీ రికార్డు సృష్టించాడు. ఎవరెస్ట్(Everest)శిఖరాన్ని 27వ సారి(27th time) అధిరోహించి తన సొంత రికార్డును తానే అధిగమించాడు. షెర్పా 53, 8,849 మీటర్ల పర్వతాన్ని ఆగ్నేయ శిఖరం మార్గంలో ఉదయాన్నే అధిరోహించినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు.
విదేశీ అధిరోహకుడితో కలిసి తాను ఉదయం 8.30 గంటలకు ఎవరెస్ట్ శిఖరానికి చేరుకున్నానని కమి రీటా పనిచేస్తున్న సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ మేనేజర్ థానేశ్వర్ చెప్పారు. ప్రస్తుతానికి కమి రీటా 27వ సారి ఎక్కినట్లు ధృవీకరించబడిందని ఆయన వెల్లడించారు.
అతను 1994లో మొదటిసారి ఎవరెస్ట్‌ను అధిరోహించాడు. ఆ తర్వాత 2014, 2015, 2020లో వివిధ కారణాల వల్ల అధిరోహణ ఆగిపోయినప్పుడు మినహా దాదాపు ప్రతి ఏటా అధిరోహించాడు.
కమీ రీటా షెర్పా 2018 నుంచి ఎక్కువ సార్లు ఎక్కిన టైటిల్‌ను కలిగి ఉన్నాడు. అతను 22వ సారి ఎవరెస్ట్‌ను అధిరోహించినప్పుడు ఈ మార్కును మరో ఇద్దరు షెర్పా అధిరోహకులతో పంచుకున్నాడు. కానీ వారిద్దరూ రిటైర్ కావడంతో ఈ రికార్డు ప్రస్తుతం తన పేరునే ఉంది.
మరోవైపు విదేశీ మారకద్రవ్యంతోపాటు ఎక్కువగా పర్యాటకంపై ఆధారపడే నేపాల్ దేశంలో ఎవరెస్ట్ శిఖరం ఎక్కేందుకు ఎక్కువ మందిని అనుమతించడం కూడా విమర్శలకు దారి తీసింది. గతంలో చాలామంది అనుభవం లేనివారు ఈ పర్వతం ఎక్కడం వల్ల జారీ పడి ప్రమాదానికి గురైన ఘటనలు కూడా ఉన్నాయి. దీంతోపాటు తొమ్మిది మంది అధిరోహకులు మరణించారు కూడా.