Elon Musk criticises working from home as “morally dubious practice”
Elon Musk:టెస్లా ఫౌండర్, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ట్విట్టర్ కొనుగోలు చేయడం.. సీఈవో, ఇతర ముఖ్య అధికారులను ఇంటికి పంపించిన సంగతి తెలిసిందే. తర్వాత ఉద్యోగుల తొలగింపు లాంటి కీలక సంస్కరణలు తీసుకొచ్చారు. తాజాగా సీఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి మాట్లాడారు.
వర్క్ ఫ్రమ్ను తొలి నుంచి మస్క్ (Musk) వ్యతిరేకిస్తున్నారు. టెస్లా ఉద్యోగులు వారానికి 40 గంటలు ఆఫీసు నుంచి పనిచేయాలని గతంలోనే మస్క్ (Musk) స్పష్టంచేశారు. ఇంటి నుంచి పనిచేయడం వల్ల ఉద్యోగుల నుంచి ఆశించినంత పని తీసుకోలేమని అభిప్రాయపడ్డారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది నైతికతకు సంబంధించిన విషయం అని మస్క్ (Musk) అభిప్రాయపడ్డారు. ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకు.. ల్యాప్ టాప్లో పనిచేసే వారి గురించి మరో రకంగా అనుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ రెండు విభాగాల మధ్య తేడా ఉంటుందని చెప్పారు.
కార్లు తయారీ చేసే ఉద్యోగులు.. సర్వీసింగ్ చేయడం, ఇళ్ల నిర్మాణ కార్మికులు, ఇల్లు కట్టడం, వంట చేయడం, వస్తువులను తయారు చేసే కార్మికులు పరిశ్రమలకు వెళ్లాల్సి ఉంటుందని మస్క్ (Musk) గుర్తుచేశారు. ఇంటి వద్ద నుంచి పనిచేసే వారు ఆఫీసులకు వెళ్లరని.. పరిశ్రమల్లో పనిచేసే వారు అక్కడికి రావాలని అభిప్రాయపడ్డారు. పరిశ్రమలకు వెళ్లి పనిచేయడం బెటర్ అని మస్క్ (Musk) అంటున్నారు.
మస్క్ (Musk) చెప్పినట్టు.. పరిశ్రమలకు సంబంధించి కార్మికులు విధిగా ఫ్యాక్టరీకి వెళ్లాల్సి ఉంటుంది. ఐటీ ఫీల్డ్.. ఇతర సిస్టమ్ వర్క్ చేసేవారికి మాత్రం వెసులుబాటు ఇస్తే సరిపోతుంది. కరోనా సమయంలో అన్నీ కంపెనీలు ఆఫర్ చేశాయి. ఇప్పుడు మెల్లిగా కంపెనీల వద్దకు రావాలని పిలుస్తున్నాయి.