Sharwanand:టాలీవుడ్ హీరో శర్వానంద్ (Sharwanand) పెళ్లి (marriage) ఖరారు అయ్యింది. రక్షితా రెడ్డితో (Rakshita Reddy) వచ్చే నెలలో వివాహ మహోత్సవం జరగనుంది. వీరి ఎంగెజ్ మెంట్ జనవరిలో జరగగా.. పెళ్లిపై క్లారిటీ లేదు. దీంతో పెళ్లి జరుగుతుందా..? లేదంటే వాయిదా పడిందా అనే అనుమానాలు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు పెళ్లి తేదీ, జరిగే ప్రాంతాన్ని వెల్డించారు.
రాజస్థాన్లో (Rajasthan) శర్వానంద్(Sharwanand)-రక్షితల వివాహాం జరగనుంది. లీలా ప్యాలెస్లో జూన్ 2,3వ తేదీల్లో పెళ్లి (marriage) నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. మ్యారెజ్కు కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇండస్ట్రీలోని ప్రముఖులకు ఆహ్వానిస్తారట. శర్వానంద్ పెళ్లి తేదీ ఖరారు చేయడంతో సోసల్ మీడియాలో అతని ఫేరు ట్రెండ్ (trend) అవుతోంది. కాబోయే వధూవరులకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.
టాలీవుడ్లో యంగ్ హీరోలు ఒక్కొక్కరు ఇంటి వారు అవుతున్నారు. కానీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (prabhas) పెళ్లి గురించి మాత్రం క్లారిటీ లేదు. ఎప్పుడూ ఏదో సాకు చూపిస్తూ.. తన పెళ్లిని వాయిదా వేస్తున్నారు ప్రభాస్. అతని ఫ్యాన్స్ మాత్రం.. డార్లింగ్ పెళ్లి ఎప్పుడని అడుగుతూనే ఉంటారు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంది.