50 yard space ఉన్నా సరే.. రూ.3 లక్షలు ఇస్తాం: గృహాలక్ష్మీ పథకంపై కేసీఆర్
50 yard space:తెలంగాణ ప్రభుత్వం గృహాలక్ష్మీ పథకాన్ని ఇటీవల ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. సొంత జాగ ఉంటే రూ.3 లక్షలు ఇస్తారు. అయితే కేవలం 50 గజాల స్థలం ఉన్నా సరే.. రూ.3 లక్షలు ఇస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. దీంతో తక్కువ స్థలం ఉన్న చాలామందికి మేలు జరగనుంది.
50 yard space:తెలంగాణ ప్రభుత్వం గృహాలక్ష్మీ (gruhalaxmi) పథకాన్ని ఇటీవల ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అంతకుముందు సొంత స్థలం ఉన్నవారికి రూ.3 లక్షలు (rs.3 lakhs) అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు దానికి ‘గృహాలక్ష్మీ’ అని పేరు పెట్టింది. పథకం వివరాలను ఇటీవల క్యాబినెట్ భేటీ (cabinet) తర్వాత మంత్రి హరీశ్ రావు (harish rao) వివరించిన సంగతి తెలిసిందే. సొంత జాగ ఉంటే రూ.3 లక్షలు (rs.3 lakhs) ఇస్తారు. అయితే కేవలం 50 గజాల (50 yards) స్థలం ఉన్నా సరే.. రూ.3 లక్షలు (rs.3 lakhs) ఇస్తామని సీఎం కేసీఆర్ (cm kcr) తెలిపారు. కానీ అందుకు షరతులు వర్తిస్తాయని పేర్కొన్నారు. తక్కువ స్థలం ఉన్నవారికి కూడా మేలు జరగనుంది.
గృహలక్ష్మీ పథకం కోసం లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగుతుందని సీఎం కేసీఆర్ (cm kcr) తెలిపారు. జిల్లా కలెక్టర్ (collector) లబ్ధిదారులను ఎంపిక చేస్తారని వివరించారు. స్థలం ఎంత అయినా ఉండని.. అందులో డబుల్ బెడ్ రూమ్ (double bedroom) మాత్రం కట్టాలని కేసీఆర్ మెలిక పెట్టారు. 50 గజాలు (50 yards) ఉన్న ఇబ్బంది లేదని ఇండైరెక్టుగా చెప్పారు. బెస్ మెంట్ లెవల్లో రూ. లక్ష, స్లాబ్ స్థాయిలో రూ.లక్ష.. ఇళ్లు పూర్తిగా నిర్మాణం పూర్తయితే రూ.లక్ష అందజేస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించి గైడ్ లైన్స్ త్వరలో విడుదల చేస్తామని వివరించారు.