»Revanth Reddy Said People Should Not Sympathize With Kavitha In Delhi Liquor Scam
Revanth Reddy: లిక్కర్ స్కాంలో కవితపై ప్రజలు సానుభూతి చూపించొద్దు
ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) కేసులో కల్వకుంట కవిత(kavitha)కు సీబీఐ విచారణ, ఈడీ నోటీసులు వస్తే తెలంగాణ ప్రజలకు సంబంధం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(revanth reddy) తెలిపారు. ఈ క్రమంలో ప్రజలు కేసీఆర్(kcr) ఫ్యామిలీపై సానుభూతి చూపించొద్దని అన్నారు. ఈ క్రమంలో గల్లీలో కవిత అయ్య కేసీఆర్(kcr), ఢిల్లీలో బిడ్డ లిక్కర్ స్కాం దాందా నిర్వహిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ఆ క్రమంలో వేల కోట్ల దోపిడీకి ప్లాన్ వేశారని చెప్పారు. ఈ స్కాంలో కవితపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆమెను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయడం లేదని రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను ప్రశ్నించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో(Delhi Liquor Scam) కల్వకుంట కవితకు(k kavitha) సీబీఐ(CBI) విచారణ, ఈడీ(ED) నోటీసులు వస్తే తెలంగాణ ప్రజలకు సంబంధం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(revanth reddy) అన్నారు. అందుకు కారణం వారు చేసిన అవినీతి పనులేనని గుర్తు చేశారు. ఈ క్రమంలో కేసీఆర్ కుటుంబానికి(kcr family) మాత్రమే ఈ కుంభకోణంతో సంబంధం ఉందని..నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు గానీ, కాంగ్రెస్ పార్టీకి గానీ ఎలాంటి సంబంధం లేదన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ కోసం ఏం కొట్లాడలేదన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రమే అవినీతికి పాల్పడి జైళ్లకు వెలుతున్నారని వెల్లడించారు. ఈ క్రమంలో బీజీపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని అన్నారు. జగిత్యాల(jagtial) అసెంబ్లీ నియోజకవర్గంలో శుక్రవారం జరిగిన సమావేశంలో భాగంగా రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
గల్లీలో కవిత అయ్య కేసీఆర్, ఢిల్లీలో బిడ్డ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) దాందా నిర్వహిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ఆ క్రమంలో వేల కోట్ల దోపిడీకి ప్లాన్ వేశారని చెప్పారు. నిజానికి బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) తొమ్మిదేళ్లు ఉమ్మడి కుటుంబంగా పనిచేశాయని రేవంత్ రెడ్డి(revanth reddy) తెలిపారు. ఇప్పుడు బీఆర్ఎస్ కు బీజేపీతో సమస్య తలెత్తినప్పుడు వారు కాంగ్రెస్ మద్దతు కోసం వస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను(telangana people) రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని గుర్తు చేశారు. కేసీఆర్ ఫ్యామిలీ అనేక అక్రమాలకు పాల్పడినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలే చెప్పాయని తెలిపారు. గత 9 ఏళ్లలో సీఎం కేసీఆర్(cm kcr)కు 23 లక్షల కోట్ల రూపాయలు వస్తే జగిత్యాల నియోజకవర్గానికి 23 కోట్లు కూడా మంజూరు చేయలేదని దుయ్యబట్టారు.
దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నందుకు కాదు.. అవినీతి కుంభకోణానికి పాల్పడి ఈడీ(Ed) నోటీసులు(notice) జారీ చేసిన కేసీఆర్ కుటుంబానికి(kcr family) తెలంగాణ ప్రజలు(telangana people) ఎలాంటి సానుభూతి చూపవద్దని రేవంత్(revanth)కోరారు. వారి ఎరలో పడవద్దని ప్రజలకు సూచించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆమెను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయడం లేదని రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను ప్రశ్నించారు. గతంలో మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు సీఎం ఆయనకు ఉద్వాసన పలికారని గుర్తు చేశారు.
మరోవైపు ఆదాయపు పన్ను (IT), సీబీఐ(CBI), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి కేంద్ర ఏజెన్సీలు బీజేపీ(BJP) ఆదేశాల మేరకు పనిచేస్తున్నాయని రేవంత్ అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ED వేధించింది. కవిత పట్ల ఇంత కఠినంగా ఎందుకు వ్యవహరించడం లేదని కేంద్రాన్ని నిలదీశారు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన పూర్తి వివరాలను ఎందుకు ఇవ్వడం లేదు? కవిత పట్ల కేంద్ర సంస్థలు ఎందుకు సాఫ్ట్ కార్నర్‌గా వ్యవహరిస్తున్నాయని నిలదీశారు. కేసీఆర్ అవినీతిపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశాను. కానీ వాటిపై ఎందుకు విచారణ చేపట్టడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(kishan reddy), బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్‌లు(bandi sanjay kumar) కేసీఆర్(KCR) అవినీతిపై ఎందుకు మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు? సీఎంపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని నిలదీశారు. దేశంలో ఈడీ, సీబీఐలు ఎలా పని చేస్తున్నాయి, బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య రహస్య అవగాహన ఏంటి అనే పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని రేవంత్ అన్నారు.