»Liquor Shops Closed For 3 Days In Three Districts Mahabubnagar Hyderabad Rangareddy
wine shops closed: మూడు జిల్లాల్లో 3 రోజులు మద్యం దుకాణాలు బంద్
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్(hyderabad rangareddy mahabubnagar) ఎమ్మెల్సీ(MLC) ఎన్నికల(elections) నేపథ్యంలో ఈ మూడు జిల్లాల్లో మూడు రోజులు మద్యం దుకాణాలు(Liquor shops) బంద్ పాటించనున్నాయి. మార్చి 11న సాయంత్రం 4 గంటల నుంచి మార్చి 13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలు(wine shops) బంద్ చేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్. ఎందుకంటే హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో మూడు రోజులపాటు వైన్ షాపులు బంద్ పాటించనున్నాయి. అయితే అందుకు ఎమ్మెల్సీ(MLC) ఎన్నికలే కారణం. ఈ ఎన్నికల నేపథ్యంలో వైన్ షాపులు బంద్ చేయాలని హైదరాబాద్ పోలీస్(police) కమిషనర్ ఈ మేరకు ఆయా ప్రాంతాల వారికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో మార్చి 11న సాయంత్రం 4 గంటల నుంచి మార్చి 13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలు(three days) బంద్ చేయాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. దీంతోపాటు వైన్ షాప్స్(wine shops) విత్ రెస్టారెంట్స్ సహా స్టార్ హోటల్లలోని బార్లు, క్లబ్ లలోని వైన్ షాపులను కూడా మూసీవేయాలని పోలీసులు తెలిపారు.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్(hyderabad rangareddy mahabubnagar ) ఎమ్మెల్సీ(MLC) స్థానం కోసం మార్చి 13న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ మూడు జిల్లాల్లో ఎన్నికలు జరిగే వరకు మద్యం దుకాణాలను(Liquor shops) బంద్ చేయనున్నారు. మరోవైపు నిబంధనలు పాటించకుండా అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు(police) హెచ్చరించారు.
మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ టీచర్స్ నియోజకవర్గంతో పాటు ఓ స్థానానికి మార్చి 13న ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్ర 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 16న ఓట్ల(voting) లెక్కింపు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూడు జిల్లాల పరిధిలో ఎన్నికల కోడ్(election code) అమల్లో ఉంది.