kavithaకు కలిసిరాని 11వ నంబర్.. ఆ రోజు విచారణ. ఈ రోజు ఏం జరగనుందో..?
11th number:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (kavitha) 11వ నంబర్ (11th number) కలిసి రావడం లేదు. అవును ఈ రోజు (మార్చి 11వతేదీన) ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (delhi liquor scam) ఈడీ (ed) విచారణకు హాజరవుతారు. గతేడాది డిసెంబర్ 11వ తేదీన (december 11th) ఉదయం 11 గంటలకు (11am) కవితను (kavitha) ఆమె నివాసంలోనే సీబీఐ అధికారులు (cbi) విచారించిన సంగతి తెలిసిందే.
11th number:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (kavitha) 11వ నంబర్ (11th number) కలిసి రావడం లేదు. అవును ఈ రోజు (మార్చి 11వతేదీన) ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (delhi liquor scam) ఈడీ (ed) విచారణకు హాజరవుతారు. గతేడాది డిసెంబర్ 11వ తేదీన (december 11th) ఉదయం 11 గంటలకు (11am) కవితను (kavitha) ఆమె నివాసంలోనే సీబీఐ అధికారులు (cbi) విచారించిన సంగతి తెలిసిందే. ఏడున్నర గంటలపాటు విచారించి.. కేసు నమోదు చేశారు. ఆ కేసు ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో ఈడీ విచారణ కోసం కవితకు (kavitha) నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే.
ఈడీ (ed) విచారణ 9వ తేదీ జరగాల్సి ఉంది. కవిత బిజీ షెడ్యూల్ వల్ల అదీ 11వ తేదీ ఉదయం 11 గంటలకు (11 am) మారింది. లిక్కర్ స్కామ్‌లో కవితను (kavitha) సెలవుదినాల్లోనే విచారిస్తున్నారు. ఆ రోజు రద్దీ ఉండదని.. ఒకవేళ అరెస్ట్ ఈజీ అవుతుందని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. సీబీఐ కవితను (kavitha) విచారించిన డిసెంబర్ 11వ తేదీ.. ఆదివారం.. (sunday) ఈ రోజు రెండో శనివారం (second saturday) కూడా హాలీ డేనే.. కవిత అరెస్ట్ తప్పదని నేపథ్యంలో హస్తినలో మంత్రులు కేటీఆర్ (ktr), హరీశ్ రావు (harish rao).. ఇతర ముఖ్య నేతలు మకాం వేశారు.
ఈ కేసులో పీఎంఎల్ఏ సెక్షన్ 50/2 కింద అధికారులు 11 మందికి (11 people) నోటీసులు ఇచ్చారు. ఇప్పటివరకు అరెస్ట్ చేసిన వారి సంఖ్య కూడా 11 మందే (11) కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ రోజు కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తారని బీఆర్ఎస్ నేతలు కూడా డిసైడయ్యి ఉన్నారు. అందుకు తగినట్టు తమ ప్రణాళికలతో సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది.
లిక్కర్ స్కామ్‌లో కవిత పాత్రపై ed అధికారులు ప్రశ్నలు కురిపించనున్నారు. మనీశ్ సిసోడియా, లిక్కర్ వ్యాపారి రామచంద్ర పిళ్లైతో కలిపి విచారిస్తారని విశ్వసనీయంగా తెలిసింది. ఆమె మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు గురించి, ఆయనే లిక్కర్ స్కామ్ పాలసీ రూపొందించారనే అంశం.. రామచంద్రా పిళ్లై గురించి, అతని వాంగ్మూలం ఇవ్వడం.. వెనక్కి తీసుకోవడం గురించి అడిగే ఛాన్స్ ఉంది. సౌత్ గ్రూపును కవిత, మాగుంట రాఘవ మెయింటెన్ చేశారట.. రూ.100 నుంచి రూ.150 కోట్ల వరకు ఆమ్ ఆద్మీ పార్టీకి చెల్లించారట.. ఇదే అంశంపై గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడిగేందుకు ఆస్కారం ఉంది. మరో వైపు ఢిల్లీలో గల ఈడీ కార్యాలయానికి ఆమె తన లాయర్‌తో కలిసి వెళతారు. అక్కడ కేంద్ర బలగాలతో భద్రతను మొహరించారు. 144 సెక్షన్ కూడా విధించారు. ఆ పరిసర ప్రాంతాల్లో బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు.