»Cm Kcr Announced Mla Kota Mlc Candidates Post For Deshapati
MLC Election : ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన సీఎం… దేశపతికి ఎమ్మెల్సీ పదవి
తెలంగాణ (Telanaagna) రాష్ట్ర శాసన మండలికి ఎమ్మెల్యేల కోటా అభ్యర్ధులుగా దేశపతి శ్రీనివాస్, (Deshapati Srinivas) కుర్మయ్యగారి నవీన్ కుమార్ ,చల్లా వెంకట్రామిరెడ్డిని బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించారు. ఈ నెల 9వ తేదీన నామినేషన్లు దాఖలు చేయాలని ఆ ముగ్గురు అభ్యర్థులకు కేసీఆర్ సూచించారు.
తెలంగాణ (Telanaagna) రాష్ట్ర శాసన మండలికి ఎమ్మెల్యేల కోటా అభ్యర్ధులుగా దేశపతి శ్రీనివాస్, (Deshapati Srinivas) కుర్మయ్యగారి నవీన్ కుమార్ ,చల్లా వెంకట్రామిరెడ్డిని బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించారు. ఈ నెల 9వ తేదీన నామినేషన్లు దాఖలు చేయాలని ఆ ముగ్గురు అభ్యర్థులకు కేసీఆర్ సూచించారు. ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన దేశపతి శ్రీనివాస్ ను ఎమ్మెల్సీ(MLC )పదవి వరించనుంది వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన దేశపతి శ్రీనివాస్ తన రచనలతో ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించి సీఎం కేసీఆర్ కు దగ్గరయ్యారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం ఓఎస్డీగానియమితుడయ్యారు. దేశపతి శ్రీనివాస్ ఎమ్మెల్సీగా తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు.
ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Vemula Prashanth Reddy) , బీఆర్ఎస్ (BRS) ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కాగా.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు, గవర్నర్ ద్వారా నామినేట్ అయ్యే ఇద్దరి పేర్లను కేబినెట్ సమావేశం (Cabinet meeting) తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలావుంటే, తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని 3 శాసన మండలి స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 2017లో ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ముగ్గురు శాసనమండలి సభ్యుల పదవీకాలం.. ఈ ఏడాది మార్చి 29న ముగియనుంది. ఆ లోగా కొత్త సభ్యుల నియామకం కోసం గులాబీ పార్టీలో కసరత్తులు మొదలైనట్టు తెలుస్తోంది. తెలంగాణలో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా స్థానాలకు ఒకరికన్నా ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉంటే.. మార్చి 23న పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓట్లు వేసేందుకు అవకాశం ఉంటుంది. పోలైన ఓట్లను అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి లెక్కించి, విజేతను ప్రకటిస్తారు. మార్చి 25 లోగా ఎన్నికలను పూర్తి చేస్తారు.