»Lalus Daughter Warns That No One Will Be Left Behind No Matter What Happens
Lalu Prasad Yadav : ఏమైనా జరిగితే ఏ ఒక్కరినీ వదిలిపెట్టను లాలూ కుమార్తె వార్నింగ్
ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న ఆర్జేడీ (RJD) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను(Lalu Prasad Yadav) సీబీఐ అధికారులు ఈరోజు విచారించారు. ఇటీవలే ఆయన సింగపూర్ లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. అతని కుమార్తె రోహిణి ఆచార్య తండ్రికి కిడ్నిని ఇచ్చారు. ఇదిలా ఉంటే రోహిణి ఆచార్య సీబీఐ (CBI) అధికారులకు వార్నింగ్ ఇచ్చారు.
ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న ఆర్జేడీ (RJD) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను(Lalu Prasad Yadav) సీబీఐ అధికారులు ఈరోజు విచారించారు. ఇటీవలే ఆయన సింగపూర్ లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. అతని కుమార్తె రోహిణి ఆచార్య తండ్రికి కిడ్నిని ఇచ్చారు. ఇదిలా ఉంటే రోహిణి ఆచార్య సీబీఐ (CBI) అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. తన తండ్ర నిత్యం వేధింపులకు గురవుతున్నారని.. ఆయనకు ఏదైనా జరిగితే తాను ఎవరిని విడిచిపెట్టబోనని హెచ్చరించారు. ఇప్పుడు జరుగుతున్నదంతా గుర్తుంచుకుంటానని… అన్నిటికన్నా కాలం చాలా బలమైనదని చెప్పారు. 74 ఏళ్ల వయసులో కూడా ఢిల్లీలో ఉన్న అధికార పీఠాన్ని షేక్ చేసే సత్తా తన తండ్రికి ఉందని అన్నారు. తమ ఓర్పును, సహనాన్ని పరీక్షిస్తున్నారని మండిపడ్డారు. సింగపూర్ (Singapore)లో ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఆయన తన మరో కుమార్తె, పార్లమెంటు సభ్యురాలు మిసా భారతి (Misa Bharti) ఢిల్లీ నివాసంలో ఉంటున్నారు.
మరోవైపు ఇదే కేసులో లాలూ భార్య రబ్రీదేవి, (Rabridevi) మిసా భారతి, మరో కూతురు హేమ కూడా నిందితులుగా ఉన్నారు. ల్యాండ్ ఫర్ జాబ్ (Land for Job)కుంభకోణంలో అప్పటి రైల్వేశాఖ (Railways)మంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ తో పాలటు మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి, కుమార్తె మిసా, హేమలు నిందితులుగా ఉన్నారు. 2004-2009 వరకు కేంద్ర రైల్వే మందిగా ఉన్న సమయంలో ఉద్యోగాలకు బదులుగా లాలూ, అతని కుటుంబ సభ్యులు భూమిని తీసుకున్నారు. దీనిపై 2022లో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే ఈ వ్యవహారంలో బీజేపీని, (BJP) ఆర్జేడీ విమర్శిస్తోంది. లాలూను చూసి బీజేపీ భయపడుతోందని, గత 30 ఏళ్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నామని ఆయన భార్య రబ్రీదేవి అన్నారు.