Amit Shah : దక్షిణాదిపై అమిత్ షా ఫోకస్.. తెలంగాణ పై బీజేపీ గురి
2019 లోక్‌సభ (Lok sabha) ఎన్నికలలో బీజేపీ మిత్ర పక్షాలతో కలిసి 333 సీట్లలో గెలిచి వరుసగా రెండోసారి ప్రధాని మోదీ (Pm modi) అయ్యారు. మరో సంవత్సరం నుంచి లోక్ సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సమయంలో బీజేపీ హైకండ్ లో అంతర్మధనం మొదలైంది. భారతీయ జనతా పార్టీ మతతత్వ రాజకీయాలకు పాల్పడుతుదని పలు రాజకీయ పార్టీలు ఆరోపించున్నాయి.
2019 లోక్‌సభ (Lok sabha) ఎన్నికలలో బీజేపీ మిత్ర పక్షాలతో కలిసి 333 సీట్లలో గెలిచి వరుసగా రెండోసారి ప్రధాని మోదీ (Pm modi) అయ్యారు. మరో సంవత్సరం నుంచి లోక్ సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సమయంలో బీజేపీ హైకండ్ లో అంతర్మధనం మొదలైంది. భారతీయ జనతా పార్టీ మతతత్వ రాజకీయాలకు పాల్పడుతుదని పలు రాజకీయ పార్టీలు ఆరోపించున్నాయి. 1996, 1998, 1999 ఎన్నికల్లో మిత్ర పక్షాల సహకారంతో అధికారంలోకి వచ్చిన పార్టీ. తొలిసారి 13 రోజులు, రెండోసారి 13 నెలలే అధికారంలో వున్నా.. ఆ సానుభూతి కలిసి రాగా 1999లో ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేపట్టి అయిదేళ్ళు అంటే 2004 దాకా దేశాన్ని పాలించిన పార్టీ. ఆ తర్వాత పదేళ్ళ పాటు అధికారానికి దూరమైన పార్టీ. అదేసమయంలో బీజేపీలో నాయకత్వం కూడా మారింది. 80వ దశకం మొదలు 2004 దాకా బీజేపీకీ సూర్యచంద్రులుగా వున్న అద్వానీ, (Advani)వాజ్‌పేయిల(Vajpayee) తరం పోయి.. కొత్త తరం వచ్చిన కాలమది. వెంకయ్య నాయుడు, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీల (Nitin Gadkari)సారథ్యంలో దాదాపు దశాబ్ధకాలంపాటు బీజేపీ పని చేసింది. అయితే వీరిలో ఏ ఒక్కరు కూడా సొంత చరిస్మాను సంతరించుకోలేకపోయారు.
ఇదేకాలంలో పశ్చిమ భారత్‌లో ఉదయించిన నరేంద్రుడు మెల్లిగా జాతీయస్థాయి నేతగాను, 2012 నాటికి ఏకంగా ప్రధాన మంత్రి అభ్యర్థిగాను పరిణామం చెందిన పరిస్థితి. ఆ తర్వాత రాజకీయాలు, ఎన్నికల ఫలితాలపై పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మోదీని ప్రధాని అభ్యర్థిగా బీజేపీ (Bjp) ఎంపిక చేసుకుందో ఆ తర్వాత ఆ పార్టీ దశదిశా మారిపోయాయి. 2014, 2019 ఎన్నికల్లో అనూహ్య ఫలితాలతో ప్రత్యర్థులను నివ్వెర పరిచారు మోదీ. 2016 నోట్ల రద్దు అంశాన్ని, రాఫేల్ (Raphael)కొనుగోలు ఒప్పందాన్ని బూచిగా చూపించి, మోదీని గద్దె దింపాలని విపక్షాలు మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ భావించాయి. కానీ అనుకున్నదొకటి అయ్యిందొకటి అన్నట్లుగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 2014 రికార్డును బద్దలు కొట్టింది. ఏకంగా 300 సీట్ల మార్కును దాటేసింది. మిత్ర పక్షాలతో కలిసి 333 సీట్లలో గెలుపొంది వరుసగా రెండోసారి నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారు. ఇక్కడి వరకు బాగానే వున్నా.. తాజాగా మరో 12-13 నెలల్లో 2024 లోక్‌సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ తరుణంలో బీజేపీ హైకమాండ్‌లో అంతర్మధనం మొదలైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది కర్నాటక (Karnataka) అసెంబ్లీ, లోక్‌సభ ఫలితాలు వేరువేరుగా రావడానికి కారణమయ్యే అవకాశాలున్నాయి.
ఇక తమిళనాడు (Tamil Nadu) విషయంలో హిందీ భాష వ్యతిరేకత, హిందీ జాతియతా భావం, బలహీనమైన మిత్రపక్షం అన్నా డిఎంకే వంటి అంశాలు బీజేపీకి ప్రతికూలంగా వున్నాయి. కేరళలోను దాదాపు ఇవే అంశాలు బీజేపీకి ప్రతికూలంగా వున్నాయి. అయితే, అక్కడ 45 శాతం వున్న మైనారిటీల మనసులు గెలుచుకునేందుకు బీజేపీ యధాశక్తి ప్రయత్నిస్తోంది. ఆ విషయంలో సక్సెస్సయితే అక్కడ రెండో, మూడో సీట్లు బీజేపీకి దక్కవచ్చు. కర్నాటకలోని 28 ఎంపీ సీట్లలో సగం గెలుచుకున్నా.. ఏపీలోని 25, తెలంగాణలోని 17, తమిళనాడులోని 39, కేరళలోని 20 ఎంపీ సీట్లు కలిపితే 91 పార్లమెంటు సీట్లలో బీజేపీ ఏ మేరకు అవకాశాలున్నాయన్నదే ఇపుడు కీలకం. తెలంగాణలోని (Telangana) నాలుగు సీట్లను ఎంతో కొంత పెంచుకునే అవకాశం వున్నా ఏపీ, తమిళనాడు, కేరళ (Kerala) రాష్ట్రాలలో ఒకట్రెండు సీట్లు గెలుచుకోవడం కూడా కష్టంగానే కనిపిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ దక్షిణాది యాత్ర ఏమేరకు సఫలమవుతుందన్నది ఆసక్తి రేపుతోంది.