»Women Bodybuilders Posing In Front Of Lord Hanuman Cut Out
Hanuman cut-out ముందు మహిళా బిల్డర్ల ఫోజులు.. కాంగ్రెస్, బీజేపీ మధ్య డైలాగ్ వార్
Hanuman cut-out:మధ్యప్రదేశ్లో చేపట్టిన బాడీ బిల్డర్ (body builder) కార్యక్రమానికి రాజకీయ రంగు పలుముకుంది. కాంగ్రెస్, బీజేపీ నేతలు మాటల యుద్దానికి దిగారు. రాట్లం వద్ద మిస్టర్ 13వ జూనియర్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ జరిగింది. ఈ నెల 4, 5వ తేదీల్లో బీజేపీ మేయర్ ప్రహ్లాద్ పటేల్ (prahlad patel) నిర్వహించారు. అయితే అమ్మాయిలు బాడీ బిల్డింగ్ (body building) చేయగా.. వెనకాల ఆంజనేయ స్వామి (lord anjaneya) విగ్రహాం ఉంది.
women bodybuilders posing in front of Lord Hanuman cut-out
Hanuman cut-out:మధ్యప్రదేశ్లో చేపట్టిన బాడీ బిల్డర్ (body builder) కార్యక్రమానికి రాజకీయ రంగు పలుముకుంది. కాంగ్రెస్, బీజేపీ నేతలు మాటల యుద్దానికి దిగారు. రాట్లం వద్ద మిస్టర్ 13వ జూనియర్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ జరిగింది. ఈ నెల 4, 5వ తేదీల్లో బీజేపీ మేయర్ ప్రహ్లాద్ పటేల్ (prahlad patel) నిర్వహించారు. అయితే అమ్మాయిలు బాడీ బిల్డింగ్ (body building) చేయగా.. వెనకాల ఆంజనేయ స్వామి (lord anjaneya) విగ్రహాం ఉంది. ఇదీ వివాదానికి కారణమైంది. ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అనే సంగతి తెలిసిందే. అక్కడికి వచ్చిన కాంగ్రెస్ నేతలు గంగాజలం (gangajal) చల్లారు. వేదికను శుద్ది చేయడానికి హనుమాన్ చాలీసా (hanuman chalisa) చదివారు.
हिंदू धर्म और बाल ब्रह्मचारी भगवान बजरंग बली का ऐसा अपमान इतिहास में कभी नहीं हुआ जैसा बीजेपी कर रही है। हनुमान जी की प्रतिमा के सामने नग्नता।
ये तो उन राक्षसों की तरह हो गए हैं जो भगवान से वर पाकर भगवान का ही द्रोह करते हैं।
— Piyush Babele||पीयूष बबेले (@BabelePiyush) March 6, 2023
ఆ తర్వాత వీడియో సోషల్ మీడియాలో (social media) పోస్ట్ చేయడంతో వైరల్ (viral) అయ్యింది. దీనిపై కాంగ్రెస్ నేత, మాజీ మేయర్ పరాస్ సక్లెచా స్పందించారు. ఆంజనేయుడి (lord anjaneya) విగ్రహాం ముందు మహిళా బాడీ బిల్డర్లు ఫోజు ఇవ్వడమా? ఇదీ ప్రహ్లాద్ పటేల్, చైతన్య కశ్యప్ వైఖరిని తెలియజేస్తుందని అన్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారిని.. నిర్వాహకులను ఆంజనేయ స్వామి శిక్షిస్తాడని జిల్లా యూత్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మయాంక్ జాట్ అన్నారు.
— Bhupendra Gupta Agam (@BhupendraAgam) March 5, 2023
కాంగ్రెస్ నేతల కామెంట్లపై బీజేపీ స్పందించింది. క్రీడల్లో రాణించడం కాంగ్రెస్ పార్టీకి (congress) ఎంతమాత్రం నచ్చదు. దీనికి సంబంధించి నిర్వాహకులు పోలీసుల (police) మెమోరాండం సమర్పించారని బీజేపీ అధికార ప్రతినిధి హితేశ్ బాజ్ పాయ్ విమర్శించారు. కాంగ్రెస్ నేతలపై (congress leaders) చర్యలు తీసుకోవాలని కోరారని చెప్పారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బర్త్ డే (birthday) సందర్భంగా కార్యక్రమం నిర్వహించారని.. ఆంజనేయ స్వామి, హిందువులకు సీఎం క్షమాపణ చెప్పాలని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్ మీడియా సలహాదారు పీయూష్ బాబ్లీ కోరారు.