Swetha:విశాఖ వివాహిత శ్వేతది (Swetha) ఆత్మహత్యేనని నగర సీపీ త్రివిక్రమ్ తెలిపారు. శ్వేత తల్లి ఫిర్యాదు మేరకు అత్తింటి వారిని అరెస్ట్ చేశామని వివరించారు. శ్వేత (Swetha) మృతికి సంబంధించి ఈ రోజు ఆయన మీడియాకు వివరించారు. భర్త లేని సమయంలో అత్తింటి వారు తక్కువ చేసి మాట్లాడటం.. ఆడపడుచులు కూడా వేధించారని సీపీ (cp) తెలిపారు.
కోటబొమ్మాళిలో 90 సెంట్ల భూమి శ్వేత (Swetha) పేరు మీద ఉందని సీపీ చెప్పారు. ఆ భూమి తన పేరు మీద రాయాలని మణికంఠ (manikanta) ఒత్తిడి తెచ్చారట. అలాగే తన తల్లి బాగడి రమ.. ముందే మణికంఠ శ్వేత (Swetha) గొంతు పట్టుకున్నాడట.. దీంతో ఆమె కుమిలిపోయిందని వివరించారు. ఇదివరకు కూడా ఓ సారి సూసైడ్ అటెంప్ట్ చేసిందని చెప్పారు. మరిన్ని సాక్ష్యాల కోసం శ్వేత మొబైల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపించామని తెలిపారు.
తాను ఉన్నా.. లేకున్నా ఫర్లేదు.. కొత్త జీవితానికి ఆల్ ద బెస్ట్ అని సూసైడ్ లేఖలో రాసిన అంశాలను వివరించారు. శ్వేత ఒంటిపై గాయాలు లేవని.. దాడి చేసిన ఆనవాళ్లు లేవని చెప్పారు. పెళ్లయి ఏడాది గడిచిందని.. ప్రెగ్నెన్సీ కావడంతో సాక్ష్యాధారాలు అన్నీ కలెక్ట్ చేశామని చెప్పారు. కఠిన శిక్ష పడేలా కోర్టులో సాక్ష్యాలు సబ్ మిట్ చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు సీసీటీవీ ఫుటేజీ లభించలేదని.. రికవరీ అయితే మీడియాకు విడుదల చేస్తామని చెప్పారు.
శ్వేతను (Swetha) ఆమె ఆడపడుచు భర్త సత్యం (satyam) లైంగిక వేధింపులకు గురిచేశాడని ఆమె తల్లి ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతోపాటు శ్వేత మృతదేహాంపై లో దుస్తులు మాత్రమే ఉన్నాయి. దీంతో ఏం జరిగిందనే సందేహాలు కలుగుతున్నాయి. ఇంజినీరింగ్ చేసిన శ్వేత (Swetha).. ఉన్నత విద్య చదివేందుకు ప్రయత్నించగా.. అత్తింటి వారు అభ్యంతరం తెలిపారట. కుటుంబ సభ్యుల విభేదాలు వచ్చి ఉంటాయని.. అన్నీ కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నామని సీపీ వివరించారు.