Reveal who take rs.3 lakhs to dalith bandu deserves
YS Sharmila:దళిత బందు పథకంలో 3 లక్షలు తీసుకున్న ఎమ్మెల్యేల లిస్ట్ బయట పెట్టాలని వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) డిమాండ్ చేశారు. అవినీతికి పాల్పడ్డ ఎమ్మెల్యేపై యాక్షన్ తీసుకుంటాం.. టిక్కెట్ ఇవ్వమని చెబుతున్నారు.. వారి పేర్లు ఎందుకు బయట పెట్టరని అడిగారు. లిస్ట్ బయట పెడితే ఎమ్మెల్యేలు తెగిస్తారు అని భయమా..? పేర్లు బయట పెడితే మీరే అవినీతి పరులు అని అంటారని భయమా..? అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో 70 వేల కోట్లు తిన్నారని అడుగుతారు అని భయమా.? బిడ్డ లిక్కర్ స్కాం, కొడుకు రియల్ ఎస్టేట్ స్కాం గురించి అడుగుతారని భయమా..? మీరే అవినీతి చేశారు.. మీకు టిక్కెట్ ఎందుకు అని అడుగుతారు అని అనుకున్నారా..? అని షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదే అంశంపై సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.
రాష్ట్రంలో 36వేల మందికి దళిత బందు ఇస్తే అందులో అందులో వెయ్యి కోట్లు ఎమ్మెల్యేలు తిన్నారని ఆరోపించారు. మీరు చెప్పిన లెక్క ప్రకారం వెయ్యి కోట్లు అవినీతి జరిగిందని చెప్పారు. అవినీతి చేసిన ఎమ్మెల్యేలను భర్తరఫ్ చేయాలి.. కేసీఆర్ (kcr) సీఎం పదవీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ పదవులకు రాజీనామా చేయాలని కోరారు.
కేసీఆర్ (kcr) పేరు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాదు..కరప్షన్ చంద్రశేఖర్ రావు అని విమర్శించారు. ఎమ్మెల్యేలు కమీషన్లు తింటుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని అడిగారు. మిగతా పథకాల్లో చేసిన అవినీతి చిట్టా కూడా ఉందా అన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవినీతి పరులు అని పాదయాత్రలో నిరూపణ అయ్యిందని షర్మిల (sharmila) పేర్కొన్నారు. కమీషన్లు, ప్రభుత్వ భూముల కబ్జా.. ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం అవినీతే అని చెప్పారు. నియోజక వర్గాల్లో ప్రతి కాంట్రాక్ట్ ఎమ్మెల్యేలే చేశారని చెప్పారు. అవినీతి ప్రభుత్వం, దొంగల ప్రభుత్వం అని ధ్వజమెత్తారు.