Priest Posing As Infosys Sudha Murthy Staff And Collect Money
Infosys Sudha Murthy: ఏ కష్టం లేకుండా సంపాదించాలని కొందరు అనుకుంటారు. ఏం చేద్దాం.. ఎవరి పేరుతో మోసం చేద్దాం అనే ఆలోచనలతో ఉంటారు. అలా చేసేవారు క్రిమినల్స్ ఉండేవారు.. ఇప్పుడు ఇతరులు కూడా వస్తున్నారు. అవును.. బెంగళూరులో ఓ పూజారి ఇలా ఛీట్ చేసి పోలీసులకు దొరికిపోయాడు. అందుకోసం ఏకంగా ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి సతీమణి సుధా నారాయణ మూర్తి (Sudha Murthy) తనకు తెలుసు అని చెప్పుకుంటున్నాడు. సమావేశాలకు తీసుకొస్తానని డబ్బులు వసూల్ చేశాడు.
ఇన్ఫోసిస్ నారాయణమూర్తి భార్య సుధామూర్తి రచయిత్రి, సంఘ సేవకురాలు.. కంపెనీ స్థాపించేందుకు నారాయణ మూర్తికి రూ.10 వేలు ఇచ్చారట. భార్య, భర్తలు ఇద్దరూ సమాజ సేవ చేస్తున్నారు. ఇద్దరూ సెలబ్రిటీలు అయినందున.. సమావేశాలకు రావాలని ఇన్వైట్ చేస్తుంటారు. వీలుంటే వెళతారు.. లేదంటే లేదు. అలా ఇద్దరు మహిళలు సుధామూర్తి పేరు వాడుకొని ఛీట్ చేస్తున్నారు. ఆ విషయం సుధామూర్తి అసిస్టెంట్‌కు తెలిసింది. వెంటనే జయనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిద్దరూ రైటర్లుగా చెప్పుకొని ఛీట్ చేశారని పోలీసులు గుర్తించారు. ఆ కేసు విచారణ జరుపుతుండగా అరుణ్ కుమార్ అనే పూజారి పేరు కూడా బయటకు వచ్చింది.
ఈ ఏప్రిల్ 5వ తేదీన కాలిఫోర్నియాలో కన్నడ కూటా 50వ వార్షికోత్సవం నిర్వహించింది. సుధామూర్తి పాల్గొనాలని కన్నడ కూటా ఈ మెయిట్ చేసింది. రావడం తనకు వీలు కాదని మేసెజ్ ఇచ్చారు. దీంతో కన్నడ కూటా కమిటీ బాధ పడింది. దానిని ఓ మహిళ తనకు అనుకూలంగా మార్చుకుంది. సెప్టెంబర్ 26వ తేదీన సేవా మిల్పిటాస్లో జరిగే మీట్ అండ్ గ్రీట్ విత్ డాక్టర్ సుధామూర్తి కార్యక్రమంలో పాల్గొంటారని పోస్ట్ చేశారు. ఆ ప్రోగ్రాం టికెట్ 40 డాలర్లు పెట్టగా.. హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. రెండో మహిళ భర్తకు బంధువు అవుతాడు పూజారి అరుణ్ కుమార్. మహిళ గొంతుతో కార్యక్రమ నిర్వహకులతో మాట్లాడి.. సుధామూర్తిని రప్పిస్తానని చెప్పాడు. అలా రూ.5 లక్షలు వసూల్ చేశాడు. మహిళల గురించి కేసు విచారిస్తోండగా పూజారి బాగోతం బయటపడింది. అరుణ్‌ను అరెస్ట్ చేశారు. ఆ ముగ్గురిని విచారిస్తున్నారు.