పాఠాలు చెప్పాల్సిన ఓ టీచర్ బుద్ది తప్పింది. విద్యార్థినిని బెదిరించి లోబరుచుకున్నాడు. ఆ విద్యార్థిని గర్భం ధరించి, డెలివరీ కావడంతో అసలు విషయం తెలిసింది.
Teacher: విద్యాబుద్దులు చెప్పాలని బడికి పంపితే.. ఓ కామాంధుడు స్టూడెంట్ను (student) తల్లిని చేశాడు. తన వృత్తికి కళంకం తీసుకొచ్చాడు. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగింది. సదరు విద్యార్థినికి కడుపునొప్పి వస్తే అసలు విషయం తెలిసింది. స్టూడెంట్ ఫిర్యాదు చేయడంతో పోక్సో చట్టం, 376, 506 సెక్షన్ల కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు.
కదిరి నియోజకవర్గంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాలిక పదో తరగతి చదువుతోంది. నీళ్లు తాగేందుకు స్టాఫ్ గదిలోకి వెళ్లింది. అక్కడ ఒంటరిగా ఉన్న టీచర్ (Teacher) రెడ్డి నాగయ్య లైంగికదాడికి తెగబడ్డాడు. తర్వాత విషయం ఎవరికైనా చెబితే బాగుండదని బెదిరించాడు. దీంతో ఆ విద్యార్థిని విషయం ఎవరికీ చెప్పలేదు. దీనిని అలుసుగా తీసుకొని.. పలుమార్లు లైంగికదాడికి తెగబడ్డాడు. టీచర్ కదా.. ఏమైనా చేస్తాడని ఆ విద్యార్థిని బాధను భరించింది.
ఇటీవల కడుపు నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ గర్భవతి అని తెలియడం.. మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో పేరంట్స్ షాక్ అయ్యారు. ఏం జరిగిందని ఆరా తీస్తే అసలు విషయం చెప్పేసింది. స్టూడెంట్‌కు రక్తం తక్కువ ఉంది. దీంతో కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్కడ ఔట్ పోస్ట్ పోలీసుల ద్వారా ఎస్ఐ రాజశేఖర్‌కు విషయం తెలిసింది. ఆ కీచక టీచర్‌ను అరెస్ట్ చేశారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిని కదిరి డీఎస్పీ శ్రీలత పరామర్శించారు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఇలాంటి కొందరి వల్ల టీచర్ వృత్తికే కళంకం వస్తోంది. సమాజంలో ఆ ప్రొఫెషన్లో ఉన్నవారి స్థాయి తగ్గుతోంది.