KMM: ఈనెల 19 నుంచి 21 వరకు ఖమ్మం సప్తపది ఫంక్షన్ హాల్లో సీపీఐ జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరుగుతాయని ఆ పార్టీ జాతీయ సభ్యులు బాగం హేమంతరావు తెలిపారు. తొలిరోజు కౌన్సిల్ సమావేశాలు ప్రారంభం కానుండగా, 20న జరిగే జాతీయ స్థాయి సెమినార్లో జాతీయ కార్యదర్శులు డి.రాజా, ఎంఎ.బేబి, దీపాంక్ భట్టాచార్యతో పాటు వామపక్ష పార్టీల జాతీయ నేతలు పాల్గొంటారని వెల్లడించారు.