అధికారుల క్రమశిక్షణ చర్యలతో మనస్థాపానికి గురైన బండ్లగూడ డిపో మహిళ కండక్టర్ శ్రీ విద్య (Conductor Shri Vidya) ఆత్మహత్యకు పాల్పడింది. బండ్లగూడ డిపో(Bandlaguda Depot) కు చెందిన శ్రీవిద్య రెండ్రోజుల కిందట స్లీపింగ్ ట్యాబ్లెట్స్ మింగేసింది.గమనించిన కుటుంబసభ్యులు హాస్పిటల్కు తరలించారు. అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ సోమవారం శ్రీవిద్య చనిపోయింది. మహిళా కండక్టర్ మృతిపై ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి (Secretary Rajireddy) విచారం వ్యక్తం చేశారు.
ఆయన మాట్లాడుతూ..ఆర్టీసీ అధికారుల వేధింపుల వల్లే శ్రీవిద్య సూసైడ్ (Suicide) చేసుకున్నదని ఆరోపించారు.జైపూర్ కాలనీకి వెళ్లే రూట్లో చివరి స్టాప్ వరుకు వెళ్లకుండా కొంత దూరం నుంచే బస్సును తిప్పడంపై డ్రైవర్ షరీఫ్ (Driver Sheriff) తోపాటు శ్రీ విద్యను డిపో స్పేర్లో ఉంచారు.క్రమశిక్షణ చర్యల కింద ఇద్దరినీ హయత్ నగర్ డిపోకు ట్రాన్స్ఫర్ చేశారు. బండ్లగూడ డిపోలో 12 సంవత్సరాల నుంచి ఆర్టీసీ కండక్టర్గా శ్రీవిద్య పని చేస్తోంది. ఈనెల 12 న ఆమె సస్పెన్షన్ గురైంది.
దీంతో తీవ్ర మనోవేదన గురైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీపీ మాత్రలు ఎక్కువ మోతాదులో తీసుకుని శ్రీవిద్య స్పృహ కోల్పోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీ విద్య మృతి చెందింది. ఆమె కుమారుడి ఫిర్యాదు ఆధారంగా ఎల్బీ నగర్ (LB Nagar)పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.